స్టార్ డైరెక్టర్ గా తన కెరీర్లో పీక్స్ ను చూసిన పూరి జగన్నాధ్ ఈమధ్య ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవుతున్నాడు. తనకు అలావాటైన రొటీన్ ఫార్మాట్ లో సినిమాలు తీసుకుంటూ వెళ్ళడంతో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతం కాలేకపోతున్నాయి. ఒక సినిమా రిలీజ్ కు ముందే మరో సినిమాకు క్లాప్ కొట్టే పూరికి 'మెహబూబా' తర్వాత గ్యాప్ వచ్చింది.
ఈమధ్య ఎనర్జిటిక్ హీరో రామ్ తో డిస్కషన్స్ జరుతున్నాయని సినిమా ఫైనల్ అవుతుందని వార్తలు వచ్చాయి కదా. అదే సమయంలో రామ్ మరో డైరెక్టర్ పేరును కూడా తన నెక్స్ట్ సినిమాకు పరిశీలిస్తున్నాడని కూడా అన్నారు. తాజా సమచారం ప్రకారం పూరి వినిపించిన ఫైనల్ వెర్షన్ కు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాను రామ్ పెదనాన్నగారు స్రవంతి రవి కిషోర్ - పూరి జగన్నాధ్ లు సంయుక్తంగా నిర్మిస్తారని సమాచారం.
ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను డిసెంబర్ నుండి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. రామ్ - పూరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కడం ఇదే మొదటి సారి. పూరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ సినిమా విజయం చాలా కీలకం కానుంది. ఇప్పటికే స్టార్ హీరోలెవ్వరూ పూరి తో సినిమా చేసేందుకు సిద్ధంగా లేరు. మరి ఈ సినిమాతో విజయం సాధించి కెరీర్ లో తిరిగి పుంజుకుంటాడేమో వేచి చూడాలి.