డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పూరి ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబుతో ఒక సినిమాకు కమిట్ చేయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేం కాని త్వరలో వెంకటేష్ హీరోగా పూరి సినిమా ఉంటుందని అంటున్నారు.
వీరిద్దరి కాంబోలో గతంలోనే ఒక సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబో మూవీ గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. గత రెండున్నర నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో పూరి జగన్నాధ్ కథల తయారీలో పడ్డాడట. ఈ సమయంలోనే ఒక కథను వెంకటేష్ కు వినిపించగా ఆయన ఓకే అన్నాడని.. ఆ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇద్దరికి ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి అయిన తర్వాత వీరి కాంబో మూవీ ఉంటుందని అంటున్నారు. పూరి చెప్పిన ఆసక్తికర పాయింట్ వెంకటేష్ కు బాగా నచ్చడంతో నారప్ప పూర్తి అయిన వెంటనే ఈ సినిమాలో నటిస్తానంటూ హామీ ఇచ్చాడట. పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.