కన్ఫామ్‌: పూరీ డైరెక్షన్ లో కళ్యాణ్

Update: 2016-02-03 11:34 GMT
జ్యోతిలక్ష్మి - లోఫర్ ఫ్లాప్ అయ్యాక డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ట్రాక్ మారిపోయింది. ఇప్పటికిప్పుడు భారీ చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశం లేదు. స్టార్ హీరోలు పూరీకి వెంటనే ఛాన్స్ అవకాశం కనిపించడం లేదు. చిరు సినిమా కూడా చేజారి పోయింది. అలాగే చిరుతో చేయాల్సిన ఆటోజానీని మాస్ మహరాజ్ రవితేజతో చేసేందుకు ఓకే అనుకున్నా.. వెంటనే స్టార్ట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు పూరీ జగన్నాధ్.

వెంటనే ఓ హిట్ కొట్టేందుకు గాను.. నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ తో మూవీ చేయాలని అనుకుంటున్నాడు పూరీ జగన్నాధ్. ఇప్పటికే ఈ హీరోకి స్టోరీ లైన్ చెప్పగా.. ఓకే చెప్పాడని అంటున్నారు. తనే నిర్మాతగా ఉంటానని కూడా చెప్పాడట కళ్యాణ్ రామ్. త్వరలోనే ఈ సినిమా ట్రాక్ లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు కళ్యాణ్ రామ్ కి కూడా హిట్టు చాలా ముఖ్యం.

గతేడాది ప్రారంభంలో పటాస్ తో సూపర్ హిట్ కొట్టన కళ్యాణ్ రామ్, ఇక ట్రాక్ లోకి వచ్చేశాడని అనుకున్నారు. కానీ షేర్ మూవీ కారణంగా.. వచ్చిన హైప్ అంతా మళ్లీ కొండెక్కేసింది. ఫ్లాప్స్ లో పూరీ - కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి ఓ సూపర్బ్ మూవీతో ప్రేక్షకుల ముందుగు రానున్నారని అంటున్నారు.
Tags:    

Similar News