అన్నదమ్ములిద్దరినీ ఒకేరోజు పట్టేసిన పూరీ

Update: 2016-02-04 12:30 GMT
డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఒకేరోజు ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు కథలు చెప్పి ఓకే చేయించుకున్నారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కి ఒక కథ, అలాగే మరో హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కి ఒక కథ చెప్పి.. ఈ రెండు కథల్ని ఒకేరోజు ఓకే చేయించుకున్నారట పూరి జగన్నాథ్‌. నిన్ననే కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన పూరీ.. మరోసారి తారక్ తో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. గత ఏడాది ‘టెంపర్’ సినిమాతో ఎన్టీఆర్ కు మంచి హిట్ సినిమా అందించాడు. ముచ్చటగా మూడోసారి కూడా తారక్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట పూరీ.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’తో బిజీగా వున్నాడు. దాని తరువాత పూరీతోనే సినిమా చేయబోతున్నాడట ఎన్టీఆర్.
సాధారణంగా ఐదారు కథలు చెప్పి 20, 30 సార్లు సిట్టింగ్స్‌ వేస్తేగానీ కథలు ఓకే అవ్వని ఈరోజుల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు వేర్వేరుగా కథలు చెప్పి ఒకే సిట్టింగ్‌ లో ఓకే చేయించడం పూరి వల్లే సాధ్యమైంది. ఈ అరుదైన రికార్డ్‌ ను సాధించిన పూరి జగన్నాథ్‌ ని నిజంగా అభినందించాల్సిన విషయమే. వరుసగా జ్యోతిలక్ష్మీ - లోఫర్ సినిమాలు కొంత నిరాశ పరిచినా.. చిరుతో 150వ సినిమా చేజారినా.. ఎలాంటి డిప్రెషన్ కు లోను కాకుండా పూరీ... నందమూరి హీరోలతో వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.

కళ్యాణ్‌ రామ్‌ కాంబినేషన్‌ లో పూరి జగన్నాథ్‌ చెయ్యబోతున్న సినిమాను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌ లో ఏప్రిల్‌ నుంచి స్టార్ట్‌ చేస్తున్నారన్న విషయం ఆల్రెడీ కన్‌ ఫర్మ్‌ అయిపోయింది. ఇక ఎన్టీఆర్‌ తో పూరి జగన్నాథ్‌ చెయ్యబోయే సినిమాను ఏ బేనర్‌ లో చెయ్యబోతున్నారు, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందనే విషయాలు తెలియాల్సి వుంది.
Tags:    

Similar News