ప్రపంచమంతా ఫాదర్స్ డేని జరుపుకొంటోంది. తండ్రులతో కలిసి దిగిన ఫొటోల్ని పోటాపోటీగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెట్టి విషెస్ చెప్పుకొంటున్నారు. తండ్రులతో అనుబంధాన్ని చాటుకొంటున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం గాడ్ ఫాదర్స్ డేని జరుపుకొంటున్నాడు. ఆయన గాడ్ ఫాదర్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువు... రామ్ గోపాల్ వర్మ. ఆయన ఫొటోని ది గాడ్ ఫాదర్ పోస్టర్ తరహాలో డిజైన్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు పూరి. మామూలుగా వర్మ కాంపౌండ్ కి ఇలాంటి ప్రత్యేకమైన రోజులు జరుపుకోవడం ఇష్టముండదు. రామ్ గోపాల్ వర్మ అయితే ప్రత్యేకంగా ఏ రోజు వచ్చినా దానిపై ఓ సెట్టైర్ వేస్తూ ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతుంటాడు. పూరికి మాత్రం రామ్ గోపాల్ వర్మ అంటే చెప్పలేనంత ప్రేమ. ఆ ప్రేమని ఫాదర్స్ డే సందర్భంగా మరోసారి చాటి చెప్పాడు.
నాకు వర్మ గాడ్ ఫాదర్ అంటూ ట్విట్టర్ ద్వారా చెప్పకనే చెప్పాడు. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి. పూరి జగన్నాథ్ వృత్తిగత జీవితాన్నీ - వ్యక్తిగత జీవితాన్నీ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో రామ్ గోపాల్ వర్మ ముందు వరసలో ఉంటారు. ఆయనలాగే కరెన్సీని ముట్టుకోకుండా బతకాలని పూరి తరచుగా చెబుతుంటారు. మరి అది పూరికి ఎప్పుడు సాధ్యమవుతుందో చూడాలి. అన్నట్టు వర్మ పూరికి మాత్రమే కాదండోయ్... ఇండస్ట్రీలో చాలామందికీ గాడ్ ఫాదరే. వాళ్లందరూ కూడా ఈ రోజు గాడ్ ఫాదర్స్ డేని జరుపుకొంటుంటారేమో!