పోకిరి చేతుల్లో నందమూరి చిరుత

Update: 2017-09-26 12:17 GMT
హీరోలను లాంఛ్ చేయడంలో దర్శకుడు పూరీ జగన్నాధ్ కు బోలెడంత గుర్తింపు ఉంది. సౌత్ లో దాదాపుగా హీరోల వారసులను లాంఛ్ చేయాలంటే.. మాస్ హీరోగా అరంగేంట్రం చేయించాలంటే.. మొదటగా గుర్తొచ్చే పేరు పూరీ జగన్నాధ్. కానీ ఇదంతా గతంలో మాత్రమే. ఇప్పుడు పూరీ ట్రాక్ రికార్డ్ ను పరిశీలిస్తే.. ఎవరూ ఇంత ధైర్యం చేయాలని అనుకోరు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ ధైర్యం చేసేస్తున్నారట. ఛిరుత అంటూ రామ్ చరణ్ ను లాంఛ్ చేసినది కూడా పూరీనే. పోకిరితో మహేష్ ను టాప్ స్టార్ గా తీర్చిదిద్దింది కూడా పూరీనే.

తన వారుసుడు నందమూరి మోక్షజ్ఞను పూరీ దర్శకత్వంలోనే అరంగేట్రం చేయించాలని ఫిక్స్ అయిపోయారట బాలయ్య. రీసెంట్ గా పైసా వసూల్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ ఖాయమేనని చెప్పిన బాలయ్య.. పూరీ చేతుల్లోనే తన పుత్రరత్నాన్ని పెడుతున్నారని తెలుస్తోంది. పైసా వసూల్ చిత్రం థియేటర్లలో ఆడకపోయినా.. ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయినా.. ఫిలిం మేకింగ్ లో పూరీ ట్యాలెంట్ ను మాత్రం బాలయ్య మర్చిపోలేకపోతున్నారట. పైగా కొన్నేళ్లుగా తనకు దర్శకులు అందరూ సీరియస్ పాత్రలు మాత్రమే ఆఫర్ చేస్తుండగా.. తనను ఓ లవర్ బోయ్ రేంజ్ లో చూపించి.. కుర్ర హీరో టైపులో ప్రొజెక్ట్ చేయడం బాలయ్యకు తెగ నచ్చేసిందట.

అలాగే మేకింగ్ స్టైల్ విషయంలో కూడా పూరీ శైలి నచ్చడంతో.. తన కుమారుడిని లాంఛ్ చేసేందుకు పూరీనే కరెక్ట్ అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నందమూరి అభిమానుల నుంచి అభ్యంతరాలు వస్తూన్నా.. స్టోరీ రెడీ చేసుకోమని పూరీకి సిగ్నల్ ఇఛ్చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News