విజయ్ దేవరకొండతో పూరి జగన్నాద్ తెరకెక్కిస్తున్న 'ఫైటర్' మూవీని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు పూరి సన్నాహాలు చేస్తున్నాడు. అందుకోసమే ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ ను భాగస్వామిగా చేసుకోవడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను విజయ్ దేవరకొండకు జోడీగా నటింపజేస్తున్నాడు. ఈ కారణాల వల్ల సినిమాకు పాన్ ఇండియా బజ్ ను తీసుకు రావాలనుకున్నాడు. అయితే కరణ్ జోహార్ ఈమద్య కాలంలో వివాదాస్పదం అవ్వడంతో పాటు అనన్య పాండే కు నెపొటిజం దెబ్బ పడే అవకాశం ఉంది. ఆ కారణంగా ఫైటర్ మూవీకి హిందీ ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో ఊహించుకోవచ్చు. అందుకే ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ ను కూడా నటింపజేయాలనే నిర్ణయానికి వచ్చారట.
ప్రముఖ హిందీ నటుడిని ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను నటింపజేయాలని భావిస్తున్నారు. ఆయన ప్రజెన్స్ తో సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో అంచనాలు పెరిగే అవకాశం ఉంటుందని దర్శకుడు పూరి భావిస్తున్నాడట. అందుకే ఈ లాక్ డౌన్ టైంలో స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేసి ఒక పాత్రను పెంచి ఆ పాత్రకు గాను హిందీ నటుడిని నటింపజేస్తున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా కథ ఉంటుందని మొదటి నుండి మేకర్స్ చెబుతున్నారు.
ఇక విజయ్ దేవరకొండకు ఉత్తరాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. అర్జున్ రెడ్డి కారణంగా విజయ్ అక్కడ నోటెడ్ అయ్యాడు. ఇక డియర్ కామ్రేడ్ సినిమా కూడా హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను మరియు రికార్డు స్థాయి లైక్స్ ను దక్కించుకుంది. కనుక ఫైటర్ సినిమాకు ఉత్తరాదిని భారీ బజ్ ఉండటం ఖాయం. ఇలాంటి సమయంలో ఒక హిందీ నటుడు ఈ సినిమాకు వర్క్ చేస్తే సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం అంటున్నారు.