ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప- ది రైజ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ `పుష్ప: ది రూల్` కొత్త షెడ్యూల్ ఇటీవల విశాఖపట్నంలో ప్రారంభమైంది. బీచ్
సొగసుల విశాఖ నగరంలో అలాగే ఆ చుట్టు పక్కల అందమైన పరిసరాల్లో 19 రోజుల పాటు చిత్రీకరణ సాగనుంది. శ్రీవల్లి పాత్రధారి రష్మిక మందన్న వచ్చే నెలలో యూనిట్ తో చేరనున్నారనేది తాజా అప్ డేట్. ప్రస్తుతం హిందీ చిత్రం `మిషన్ మజ్ను`లో తన అద్భుత నటనకు ప్రశంసలు అందుకుంటున్న ఈ బ్యూటీ తదుపరి పుష్ప 2 కోసం ప్రిపరేషన్ ని ప్రారంభించనుందని తెలిసింది.
తాజా ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ... ``రెండవ భాగంలో మేం జీవించే ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకున్నాం. అందువల్ల నటీనటుల ప్రదర్శనలు మారబోతున్నాయ``ని అన్నారు. రెండవ భాగం మొదటి భాగం కంటే చాలా ఎక్కువ ఎమోషన్స్ తో వావ్! ఫ్యాక్టర్ తో అద్భుతాలు చేస్తుందని రష్మిక ధీమాను కనబరిచింది. మొదటి భాగం పుష్ప - ది రైజ్ లో మా పనిని ప్రేక్షకులంతా చూశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మేమంతా ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామో చాలా స్పష్టంగా ఉన్నాం. కాబట్టి మా షో అంతా మారబోతోంది. రెండో భాగంలో నటన తీవ్రమైన ఎమోషన్ ఘాడతతో సాగుతుంది`` అని రష్మిక అన్నారు. అబ్బాయిలూ ప్రత్యేకించి ఇది మీకు అద్భుతంగా నచ్చుతుందని టీజ్ చేసారు.
సుకుమార్ రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. పుష్ప: ది రూల్ (పార్ట్ 2) పుష్ప రాజ్ జీవితాన్ని మరింత లోతుగా తెరపై ఆవిష్కరిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ లో పుష్పరాజ్ ఎదుగుదలతో పాటు ప్రమాదాలు... ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ తో ఘర్షణ నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఆద్యంతం రక్తి కట్టిస్తుందని చెబుతున్నారు. అటవీ అధికారిగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో నటించాడు. మొదటి భాగం చివరిలో అవమానానికి గురైన తర్వాత పుష్పరాజ్ తో స్కోర్ ని సెటిల్ చేయడానికి ఆసక్తి గా ఎదురు చూస్తుంటాడు. అటుపై అతడి ఎత్తుగడలు ఫలించాయా లేదా? అన్నది తెరపైనే చూడాలని తెలుస్తోంది.
ఇప్పటికే సీక్వెల్లో సునీల్- అనసూయ- జగదీష్- ధనంజయ-రావు రమేష్ తదితరులు నటిస్తున్నారని కథనాలొచ్చాయి. వీరంతా మొదటి భాగం నుండి తమ పాత్రలను పునరావృతం చేయనున్నారు. ఈ తారాగణంలో జగపతి బాబు తాజా చేరిక. ఇంకా పలువురు హిందీ తారలు ఈ చిత్రంలో నటించే అవకాశం ఉంది. ముఖ్యంగా షెకావత్ (ఫహద్) కి ధీటైన మరో అధికారిని కూడా ఉత్తరాది నుంచి బరిలో దించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప 1 పాన్ ఇండియా కేటగిరీలో దాదాపు 350 కోట్లు వసూలు చేసిందని టాక్ వినిపించింది. ఇప్పుడు పార్ట్ 2తో మినిమంగా 1000 కోట్లు వసూలు చేయాలనే పంతంతో సుకుమార్ అండ్ టీమ్ ఉన్నారట. ఆల్మోస్ట్ కేజీఎఫ్ రాఖీ భాయ్ రేంజులో పుష్ప రోల్ ని ప్రిపేర్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.