పుష్ప ను చూస్తూ 'థమన్‌' ను గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్‌

Update: 2021-12-19 04:14 GMT
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప. ఈ సినిమాకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్‌ అందించాడు. బన్నీ గత చిత్రం అల వైకుంఠపురంలో మ్యూజికల్‌ గా ఆల్ టైమ్‌ రికార్డ్‌ హిట్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. బిలియన్ ల కొద్ది యూట్యూబ్‌ వ్యూస్ దక్కించుకుని ఏడాది పాటు ట్రెండ్‌ అయిన ఆ పాటలు ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న బన్నీకి తాను కూడా అంతటి మ్యూజిక్ కు ఇవ్వాలని పుష్ప కోసం చాలా కష్టపడ్డాడు అనడంలో సందేహం లేదు. ఆయన పాటలు పుష్ప కు ప్లస్ అయ్యాయి. మాస్ బీట్స్ తో దుమ్ము రేపాడు. కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం దేవి శ్రీ వదిలేశాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పుష్ప ను థియేటర్‌ లో చూస్తున్న అభిమానులు ఈ సినిమాకు థమన్ ఆర్ ఆర్‌ ఇచ్చి ఉంటే మరో రేంజ్ లో ఉండేది అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారట. దేవి శ్రీ ప్రసాద్‌ పాటలతో పోల్చితే బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ కనీసం పర్వాలేదు అన్నట్లుగా కూడా లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల అఖండ సినిమా కు అద్బుతమైన బీజీఎం ను ఇచ్చిన థమన్‌ ను జనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పైకి ఎత్తేశారు. బీజీఎం తో సినిమా లోని ప్రతి సన్నివేశాన్ని ముఖ్యంగా హీరో ఎంట్రీ సన్నివేశాలను ఆకాశమే హద్దు అన్నట్లుగా ఒల్లు పులకరించేలా.. ప్రతి ఒక్కరి కళ్లు పెద్దవి అయ్యేలా థమన్‌ సంగీతాన్ని అందించాడు అనడంలో సందేహం లేదు. అలాంటి బీజీఎం ను మరే తెలుగు సినిమా సంగీత దర్శకుడు ఇవ్వలేడు అన్నట్లుగా ఆయన వాయించాడు. ఆయన అఖండ మాత్రమే కాకుండా తన ప్రతి సినిమాకు సంబంధించిన బీజీఎం ను కూడా అదే రేంజ్ లో ఉంచేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ప్రతి సన్నివేశంలో కూడా థమన్‌ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ హైలైట్ గానే ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పుష్ప ను చూసిన అభిమానులు ఈ సినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ఇచ్చి ఉంటే అల్లు అర్జున్‌ మాస్ రేంజ్ మరో లెవల్‌ లో ఉండేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా పాటల విషయంలో ఎలాంటి రిమార్క్‌ అయితే లేదు. కాని బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్‌ ఈ విషయంలో విఫలం అయ్యాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గత సంక్రాంతి సమయంలో థమన్‌ అల వైకుంఠపురంలో సినిమా తో మరియు దేవి శ్రీ ప్రసాద్ సరిలేరు నీకెవ్వరు సినిమా తో సందడి చేశారు. ఆ సమయంలో ఎలాంటి సందేహం లేకుండా ఇద్దరిలో థమన్ ది పై చేయి అయ్యింది. ఆ సంక్రాంతి విజేతగా థమన్‌ నిలిచాడు. ఈసారి సంక్రాంతికి ముందే కేవలం కొన్ని రోజుల గ్యాప్ లో థమన్‌ అఖండ మరియు దేవి శ్రీ ప్రసాద్‌ పుష్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరిలో ఖచ్చితంగా బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో థమన్ విజేత అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాటల విషయంలో మాత్రం పుష్ప పాటలు శ్రోతలను అత్యధికంగా ఆకర్షిస్తున్నాయి. మొత్తానికి థమన్ మరియు దేవిల మద్య పోటీ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. అయితే ఇద్దరు మాత్రం ఎలాంటి విభేదాలు లేకుండా తమ పని తాము అన్నట్లుగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ మద్య కలిసి ఎన్టీఆర్ హోస్టింగ్‌ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు షో లో కూడా పాల్గొని సందడి చేసిన విషయం తెల్సిందే.
Tags:    

Similar News