టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మరో స్టార్ హీరో పాన్ ఇండియా హీరోగా మారే సమయం ఆసన్నమైంది. ఇంతకాలం ఎదురు చూసిన దానికి శాంపిల్ ఫలితం వచ్చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ తో సుకుమార్ డైరెక్షన్ తోడైతే రిజల్ట్స్ ఏ రేంజిలో ఉండబోతున్నాయి అనేదానికి ఇంట్రడక్షన్ ప్రోమో రూపంలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేసిన పుష్ప మూవీ.. ఈ ప్రోమోతో అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. తాజాగా మైత్రి మూవీస్ వారు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా పుష్పరాజ్ ఇంట్రడక్షన్ ప్రోమో వదిలారు. నిజంగా ప్రోమో చూస్తే విజువల్స్ పరంగా ఎక్కడా కూడా సుకుమార్ అండ్ మైత్రి వారు 'తగ్గేదే లే' అనిపించారు. అలాగే పుష్పారాజ్ గా అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ ఎర్రచందనం చెట్లు నరుకుతూ చూపించి సర్ప్రైజ్ చేశారు.
మొత్తానికి అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠామేస్త్రిగా బన్నీని ఎక్కడా 'తగ్గేదే లే' అనిపించేశారు మేకర్స్. డ్రెస్సింగ్ స్టయిల్, యాక్షన్ అదరహో అనిపిస్తూ ఇదివరకు ఎన్నడూ చూడని లుక్కులో పుష్పారాజ్.. పచ్చటి అరిటాకులో పరిచిన విందు భోజనంగా రుచి చూపిస్తారని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, ఫైట్స్ మాత్రం ఖచ్చితంగా మాస్ క్లాస్ ఆడియన్స్ తో ఈలలు వేయిస్తాయి. ఎందుకంటే పుష్పారాజ్ గెటప్ లో బన్నీ తలకు ముసుగు ధరించి చేస్తున్న ఫైట్స్ ఓ రేంజిలో కనెక్ట్ అవుతాయి. ఇంకా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ 'తగ్గేదే లే' అనిపిస్తూ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. ముఖ్యంగా ఆ బాక్గ్రౌండ్ మ్యూజిక్ లో బన్నీ 'తగ్గేదే లే' అనే డైలాగ్ అదిరిందినే చెప్పాలి. ఈ సినిమాకు ఖచ్చితంగా నార్మల్ ఎంట్రీ సరిపోదని గాల్లో ఎగరటాలు.. కత్తి పట్టుకుని నరికేయటాలు పక్కా మాస్ మసాలా అంశాలుగా భావించవచ్చు. మొత్తానికి పుష్పారాజ్ గా బన్నీ లుక్ నభూతో న భవిష్యత్..కు తగ్గేదే లే.. అనేలా ఉంది.
Full View