స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ మూవీ `పుష్ప`పై తొలి నుంచి అంచనాలేర్పడిన సంగతి తెలిసిందే. `రంగస్థలం` లాంటి క్లాసిక్ హిట్ తర్వాత సుకుమార్ బన్నీని ఏ రేంజులో చూపించబోతున్నాడు? అన్న చర్చ అభిమానుల్లో సాగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అడవుల నేపథ్యంలో సినిమా అనగానే ఒకటే ఆసక్తి నెలకొంది. ఈ మూవీ కోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్లనే రంగంలోకి దించుతుండడం భారీ వీఎఫ్ ఎక్స్ .. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం స్పెషలిస్టుల్ని ఎంపిక చేస్తుండడం చూస్తుంటే ప్లాన్ ఆషామాషీగా లేదని అర్థమవుతోంది.
కథాంశం ప్రకారం.. దట్టమైన కీకారణ్యంలో సినిమాని చిత్రీకరించాల్సి ఉంది. అందుకోసం గోదావరి పరిసరాల్లోని అడవులు సహా నైజాంలో మహబూబ్ నగర్ ఏరియా ఫారెస్టును సుకుమార్ బృందం పరిశీలించారని కథనాలొస్తున్నాయి. అడవుల్లో హాలీవుడ్ రేంజ్ భారీ యాక్షన్ ని డిజైన్ చేయడంతో అందుకు తగ్గట్టు అడవుల్ని కూడా జల్లెడ పడుతున్నారట. స్మగ్లర్ల యాక్షన్ స్టోరి అదిరిపోతుందని భావిస్తున్నారు. కొంత భాగం చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీ సహా నగరాల్లోనూ ప్లాన్ చేస్తారు.
మొదటి షెడ్యూల్ లో బన్ని-రష్మిక జంటపై పాటను చిత్రీకరిస్తారు. అలాగే ప్రత్యేక గీతం కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఇందులో పోలీసాఫీసర్ గా విజయ్ సేతుపతి నటించనున్నారు. మైత్రి సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనుంది.