కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ ''పుష్ప: ది రైజ్''. అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ హ్యాట్రిక్ మూవీ డిసెంబర్ 17న విడుదలైంది. తొలి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా.. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబట్టింది. పోటీగా మరో పెద్ద సినిమా ఏదీ లేకపోవడం కూడా దీనికి కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో 'పుష్ప' పార్ట్-1 ఇప్పటికే 300 కోట్ల క్లబ్ లో చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే ఇప్పుడు 'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని ఓటీటీ వేదిక మీదకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకి దక్కించుకున్నట్లు సమాచారం. సహజంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ పెడుతుంటారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాని నెల రోజుల కంటే ముందే స్మాల్ స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ''పుష్ప'' పార్ట్-1 చిత్రాన్ని జనవరి 7న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కోవిడ్ కారణంగా థియేటర్లు క్లోజ్ చేస్తున్న నేపథ్యంలో సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకోవచ్చనే ఆలోచనతో ఓటీటీ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.
ఇదిలా ఉంటే 'పుష్ప' ఓటీటీ రిలీజ్ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు కాస్త నిరుత్సాహంగానే ఉన్నారని తెలుస్తోంది. థియేటర్ల నుంచి ఈ సినిమాకి ఇంకా రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' సినిమాలు వాయిదా పడటంతో పుష్ప మొదటి భాగానికి మరికొన్ని వసూళ్లు వచ్చే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 'పుష్ప: ది రైజ్' సినిమా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ సినిమా హిందీ మార్కెట్ లో ఊహించని విధంగా కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటి వరకు 66 కోట్ల వరకు వసూలు చేసి.. నార్త్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న డబ్బింగ్ మూవీస్ జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా ప్రభావం ఉత్తరాదిన ఇంకొన్నాళ్లు ఉండే ఛాన్స్ ఉందని.. హిందీ వెర్షన్ ని ఓటీటీలో రిలీజ్ చేయడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాగా, 'పుష్ప' చిత్రాన్నిశేషాచలం అడవుల్లో ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. కూలీగా జీవితాన్ని ప్రారంభించిన ఓ యువకుడు.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ఈ సినిమా కథాంశం. ఇందులో పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టాడు. డిఫరెంట్ మేనరిజంతో చిత్తూరు యాసలో 'తగ్గేదే లే' అంటూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. ఫహాద్ ఫాజిల్ - జగదీష్ - సునీల్ - అనసూయ - శత్రు - అజయ్ - అజయ్ ఘోష్ - ధనుంజయ కీలక పత్రాలు పోషించారు.
ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. రామకృష్ణ - మోనిక ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. కార్తీక శ్రీనివాస్ - రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. 'పుష్ప' రెండో భాగం ''పుష్ప: ది రూల్'' ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.