పుష్ప సినిమా ఏ స్థాయి వసూళ్లు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా నాలుగు వందల కోట్ల వసూళ్లను దక్కించుకున్న పుష్ప సినిమా కు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతుంది. పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలు అయ్యాయి అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఆ విషయం పక్కన పెడితే పుష్ప సినిమా రీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ నేపథ్యం లో పుష్ప సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ పుష్ప సినిమా ను కేరళలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక డబ్బింగ్ సినిమా ను ఈ స్థాయిలో రీ రిలీజ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
పుష్ప సినిమా ను కేరళలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే పుష్ప మలయాళ వర్షన్ ను రీ రిలీజ్ కోసం సన్నాహాలు మొదలు అయ్యాయి. ఈ సినిమాలో ఫాహద్ ఫాసిల్ ఉన్న కారణంగా రీ రిలీజ్ పై అక్కడ మరింతగా ఆసక్తి ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
కేరళలో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనుక పుష్ప సినిమా విడుదల అయ్యి ఏడాది కాబోతున్న నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున పుష్ప సినిమాను మళ్లీ విడుదల చేసి పండుగ చేసుకోవాలని మల్లూ బన్నీ ఫ్యాన్స్ ఉబలాటం గా ఉన్నారట. అందుకే ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఒక డబ్బింగ్ సినిమా కేరళలో రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేయడం నే చాలా గొప్ప విషయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ అవ్వడం చాలా విడ్డూరంగా ఉందంటూ జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.