ఒలింపిక్స్ లో రజత పతకం సాధించినప్పటి నుంచి పీవీ సింధు పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తాజాగా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మరోసారి సిల్వర్ మెడల్ తో సింధు మెరిసింది. సింధు విజయాల వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి ఎంతో ఉంది. అందుకే, గోపీచంద్ కు గురు దక్షిణ చెల్లించుకునేందుకు సింధు సిద్ధమైంది. కోచ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ డిజిటల్ ఫిల్మ్ ను సింధు నిర్మించింది. కెరీర్ ప్రారంభం నుంచి గోపీచంద్ కోచింగ్ లో సింధు ప్రయాణం ఎలా సాగింది, సింధు కఠోర శ్రమ వెనుకు గోపీచంద్ పాత్ర ఏమిటి అనే విషయాలను తెలియజేస్తూ ప్రముఖ ఎనర్జీ డ్రింక్ కంపెనీ గేటొరేడ్ 'ఐ హేట్ మై టీచర్' అనే డిజిటల్ ఫిల్మ్ ను రూపొందించింది. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అయిన సింధు ఈ డిజిటల్ ఫిల్మ్ కు సహ నిర్మాత గా వ్యవహరించింది.
గోపీచంద్ తన కెరీర్ గురించి కలలు కనేవారని సింధు తెలిపింది. ఆయనో అద్భుతమైన కోచ్ అని సింధు కొనియాడింది. తన కెరీర్ విజయవంతంగా సాగడంలో గోపీచంద్ పాత్ర ఎంతో ఉందని చెప్పింది. ఈ టీచర్స్ డే నాడు గోపీచంద్ కు నా విజయాలను అంకితమివ్వబోతున్నాను.తద్వారా ఆయనను గౌరవించబోతున్నాను. మీరు కూడా మీ కెరీర్ ని ప్రభావితం చేసిన వ్యక్తులను ఈ టీచర్స్ డే నాడు గౌరవించండి. మన మీద మనకన్నా ఎక్కువ నమ్మకం ఉంచిన కోచ్ లందరినీ ఈ టీచర్స్ డే నాడు అసహ్యించుకుందాం. అని సింధు తెలిపింది.
గురు శిష్యుల మధ్య ఉండే ప్రేమ - అభిమానం - ద్వేషం వంటి సున్నితమైన అంశాలను ఈ డిజిటల్ ఫిల్మ్ లో చూపించబోతున్నామని పెప్సికో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ ప్రకాష్ తెలిపారు. తమ శిష్యుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం అహర్నిశలు కష్టపడ్డ ట్రైనర్లు - గురువులు - కోచ్ లందరికీ ఈ డిజిటల్ ఫిల్మ్ అంకితమని ఆయన చెప్పారు. సింధు - గోపీచంద్ ల మధ్య ఉన్న గురు శిష్య బంధం గురించి ఈ చిత్రంలో అనేక ఆసక్తికర విషయాలు చూడవచ్చని తెలిపారు.