తెలుగు సినీ ఇండస్ర్టీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో మహేశ్ బాబు ఒకడు. ఇప్పుడు ఆయనొక్కడే అత్యధిక రెమ్యూనరేషన్ హీరోగా నిలవనున్నాడు. బ్రహ్మోత్సవం సినిమాకు ఆయనకు రూ.25 కోట్ల పారితోషికం ఇస్తున్నారని టాక్.
మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు సొంత బ్యానర్ కూడా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి మహేశ్ రెమ్యూనరేషన్ తో పాటు కొన్ని ఏరియాల హక్కులు తీసుకున్నాడు. ఈ లెక్కన అతడికి రూ.20 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని వినికిడి. ఇదేదో బాగుందని.. ఇకపై తన ప్రతి సినిమాకూ నిర్మాణంలో భాగస్వామిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారమే బ్రహ్మోత్సవంలోనూ నిర్మాణ వాటాదారుగా కలిశాడు మహేశ్. అందుకు సంబంధించి పోస్టర్లపైనా మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ భాగస్వామి అని వేశారు. అయితే.... రీసెంటుగా మాత్రం ఆ పేరు తొలగిపోయింది.కారణమేంటా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది... నిర్మాణంలో భాగస్వామ్యం ఏమీ లేకుండా మహేష్ బాబుకు పారితోషికం పెంచేస్తానని నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఆఫర్ ఇచ్చాడట. దానిప్రకారం రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ కు డీల్ కుదిరింని సమాచారం.
కాగా 'బ్రహ్మోత్సవం' సినిమాకు రికార్డు స్థాయిలో రూ.90 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనా. కాగా ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఒక భామగా నటిస్తున్న ప్రణీత… యాక్సిడెంట్ కు గురైంది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా…. ప్రణీత ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. దీంతో ఈ కన్నడ భామకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు ప్రణీతతో తీయాల్సిన సన్నివేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి.