పీవీపీ సినిమా బేనర్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ. వ్యాపారంలో ఎంత బాగా సక్సెస్ అయినా.. సినిమాల విషయానికి వచ్చేసరికి ఆయన అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాలేదు. అలాంటాయన వచ్చి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతుంటే జనాలు కొంచెం సందేహాలు వ్యక్తం చేశారు. తనకు ఏ సంబంధం లేని సినిమా గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నాడేంటి.. ఈ సినిమాను ఒకటికి రెండుసార్లు చూశానని.. తన కుటుంబ సభ్యులకు కూడా చూపించానని చెప్పడమేంటి.. ఈ సినిమా ప్రెస్ మీట్ కు హాజరై దాన్ని ప్రమోట్ చేయడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే సినిమా చూశాక కానీ అర్థం కాలేదు. పీవీపీ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా గురించి అంత గొప్పగా ఎందుకు మాట్లాడాడో?
‘అప్పట్లో ఒకడుండేవాడు’ చూసిన వాళ్లందరూ కూడా ఇది మంచి సినిమా.. తప్పక చూడండి అంటూ ఇంకొకరికి చెబుతున్నారిప్పుడు. తమ్మారెడ్డి భరద్వాజ లాంటి పెద్దోళ్లు కూడా ఈ సినిమా గురించి గొప్పగా చెప్పారు. తప్పక చూడమన్నారు. విడుదలకు ముందు ప్రివ్యూ చూసిన పీవీపీకి కూడా అలాంటి ఫీలింగే కలిగింది. అందుకే తనకే సంబంధం లేకపోయినా ఈ సినిమా ప్రెస్ మీట్ కు హాజరై దాన్ని ప్రమోట్ చేశాడు. విడుదల తర్వాత కూడా ఆయన ఈ సినిమాను ప్రమోట్ చేయాలనుకున్నారట కానీ.. వంశీ పైడిపల్లి-మహేష్ సినిమాకు సంబంధించిన గొడవలో పడి దీనికి సమయం కేటాయించలేకపోయారు. మొత్తంగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి మంచి సినిమా కోసం ఇండస్ట్రీ జనాలు చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటం మంచి పరిణామమే. కానీ ఈ సినిమాకు అవసరమైనన్ని థియేటర్లు ఇవ్వకపోవడమే విచారకరం. ఈ వారాంతంలో కొత్త సినిమాలేవీ లేని నేపథ్యంలో సరైన సినిమాల్లేక వెలవెలబోతున్న థియేటర్లను దీనికి కేటాయించాల్సిన అవసరముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/