మల్టీప్లెక్స్ లో కుటుంబ సమేతంగా సినిమా చూడాలంటే సుమారు ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబం కనీసంగా రూ.5000 ఖర్చు (టికెట్లు స్నాక్స్ కలిపి) చేయాల్సి వస్తోంది. దీంతో జనం థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కో టిక్కెట్టు పై సగం ధర తగ్గినా మిడిల్ క్లాస్ అప్పటికీ థియేటర్లకు వెళుతుందా? అంటే చెప్పలేం. టాలీవుడ్ దీనికి ఇంకా పరిష్కారం కనుగొనలేదు. దీనిపై అన్ని పరిశ్రమల్లోనూ విస్త్రతంగా చర్చ సాగుతోంది. ప్రజలు ఓటీటీకి అడిక్ట్ అవ్వడానికి కారణాల్లో పెరిగిన టిక్కెట్టు ధర చాలా కీలకమైనది.
కారణం ఏదైనా ఇప్పుడు పీవీఆర్ వంటి భారీ మల్లీప్లెక్స్ చైన్ వ్యవస్థలో నెమ్మదిగా మార్పు మొదలైనట్టే కనిపిస్తోంది. ఇకపై సందర్భానుసారం ఆడియెన్ కి తగ్గింపు టికెట్ ధరలతో ఆకర్షించే ప్రణాళికతో ఉందని తాజా ప్రకటన చెబుతోంది.
త్వరలో విడుదల కానున్న హిందీ భాషా క్రైమ్ థ్రిల్లర్ `దృశ్యం 2` కి టికెట్ ధరపై ఆఫర్ వర్తిస్తుందని పీవీఆర్ ప్రకటించింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్- టబు- శ్రియా శరణ్- అక్షయ్ ఖన్నా- ఇషితా దత్తా- మృణాల్ జాదవ్- రజత్ కపూర్ నటించారు. ఈ హిందీ చిత్రం అదే పేరుతో 2021లో వచ్చిన మలయాళ హిట్ చిత్రానికి రీమేక్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం చిత్రానికి సీక్వెల్. వచ్చే నెలలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్ లకు ఆకర్షించడానికి `దృశ్యం 2` నిర్మాతలు PVR చైన్ ఆఫ్ సినిమాస్ తో భాగస్వామ్యమై టిక్కెట్ ధరలపై ఆసక్తికరమైన ఆఫర్ ను ప్రకటించారు. ప్రేక్షకులు తమ టిక్కెట్లను PVR యాప్ లో కేవలం 50 రూపాయలకే బ్లాక్ చేసుకోవచ్చు. సినిమా మొదటి రోజు షోలపై 50 శాతం తగ్గింపు పొందవచ్చు.
అడ్వాన్స్ బుకింగ్ లు అక్టోబర్ 2న ప్రారంభమవుతాయని పీవీఆర్ ట్విట్టర్ లో ప్రకటించింది. PVR యాప్ లో దృశ్యం 2కి మొదటి రోజు షోలలో 50శాతం తగ్గింపు వర్తిస్తుందని ఆఫర్ ని ప్రకటించింది. నవంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దృశ్యం ఫ్రాంఛైజీలో రెండు సినిమాలు ఇప్పటికే తెలుగు-మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో పార్ట్ 1 అంతంత మాత్రంగానే ఆడింది. కానీ ఇప్పుడు హిందీ వెర్షన్ లో పార్ట్ 2 విడుదలవుతోంది.