హైద‌రాబాద్‌ లో పీవీఆర్ బిగ్ స్కెచ్

Update: 2019-02-21 17:30 GMT
రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ లో మ‌ల్టీప్లెక్స్ గ్యాంబ్లింగ్ కి తెర లేచిందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఓవైపు సినిమా ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు, మ‌రోవైపు భ‌వ‌న నిర్మాణ రంగంలోని దిగ్గ‌జాలు, వేరొక వైపు కార్పొరెట్ కంపెనీలు మ‌ల్టీప్లెక్స్ నిర్మాణానికి భారీగా పెట్టుబ‌డుల్ని వెద‌జ‌ల్లుతున్నాయి. ఈ రంగంలో భారీ ఆర్జ‌న‌కు ఆస్కారం ఉండ‌డంతో.. న‌గ‌ర‌వాసులంతా మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ కి అల‌వాటు ప‌డ‌డంతో మాల్స్- మ‌ల్టీప్లెక్స్ నిర్మాణంలోనూ పోటీ పెరిగింది. భారీ పెట్టుబ‌డులతో నిర్మించే మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌కు స్టార్లు ప్ర‌చారం చేస్తుండ‌డంతో జ‌నంలో వీటికి ఆద‌ర‌ణ పెరుగుతోంది.

ఇటీవ‌లే సూప‌ర్‌స్టార్ మ‌హేష్, సునీల్ నారంగ్ భాగ‌స్వామ్యంలో ఏఎంబీ మాల్ హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే ఏఎంబీ పెద్ద స‌క్సెసైంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఆ త‌ర్వాత‌ అమీర్ పేట్ ఏరియా స‌త్యం థియేట‌ర్ స్థ‌లంలో ఏషియ‌న్ నారంగ్ తో క‌లిసి స్టార్ హీరో అల్లు అర్జున్ భారీ మ‌ల్టీప్లెక్స్ నిర్మాణానికి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ప్ర‌భాస్ నెల్లూరు ప‌రిస‌రాల్లో ఓ మ‌ల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు ఏరియాల్లో భారీ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌ నిర్మాణానికి ప్ర‌ఖ్యాత పీవీఆర్ సంస్థ ప్ర‌ణాళిక‌ల్లో ఉంది. ఇప్ప‌టికే స‌ద‌రు కార్పొరెట్ నిర్మించిన మ‌ల్టీప్లెక్సులు న‌గ‌రంలో ఉన్నాయి. వీటికి అద‌నంగా కొన్ని ఎంపిక చేసిన ఏరియాల్లో భారీ మాల్స్ నిర్మించేందుకు రెడీ అవుతోంది. వీటిలో మొత్తం 32 స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నార‌ని తెలుస్తోంది. న‌గ‌రంలో ఏఏ ఏరియాల్లో వీటిని నిర్మిస్తారు? అంటే.... గ‌చ్చిబౌళి బ‌యోడైవ‌ర్శిటీ పార్క్ ఏరియా, మ‌ల‌క్ పేట్, చందాన‌గ‌ర్, మియాపూర్ త‌దిత‌ర చోట్ల భారీ మ‌ల్టీప్లెక్సుల్ని నిర్మిస్తున్నారు. వీటిలో ఒక్కో మ‌ల్టీప్లెక్స్‌లో 5 స్క్రీన్ల‌కు త‌గ్గ‌కుండా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఏ12 స్క్రీన్ ఉండే భారీ మ‌ల్టీప్లెక్స్ ని ప్యాట్నీ సెంట‌ర్ లో ఇప్ప‌టికే పీవీఆర్ నిర్మిస్తోంది. మొత్తానికి న‌గ‌రం మల్టీప్లెక్సుల మ‌యం అయిపోతోంది కాబ‌ట్టి, సింగిల్ స్క్రీన్ల‌ మ‌నుగ‌డ‌కు ఇది ఇబ్బందిక‌ర‌మేన‌ని చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News