ప్రముఖ విశ్వవిద్యాలయంగా పేరున్న హార్వర్డ్ వర్సిటీలో.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల చేత ప్రసంగాలు ఇప్పిస్తుంటారు. ఇందుకోసం ఎంపికను నిర్వహిస్తారు. విద్యార్థుల చేత నిర్వహించే ఈ కార్యక్రమానికి చాలానే మంచిపేరు ఉంది. ప్రతి ఏడాది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఇండియన్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.
ఇప్పటివరకూ ఈ కార్యక్రమానికి భారతదేశానికి చెందిన పలువురు భారతీయ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తాజాగా ఈ ఆహ్వానం పొందిన వారిలో జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తమిళ హీరో మాధవన్.. డిజైనల్ మనీష్ మల్హోత్రా తదితరులు ఉన్నారు. వర్సిలో లెక్చర్ ఇచ్చిన పవన్ ప్రసంగం ఇప్పటికే పాపులర్ అయ్యింది. ఉత్తరాది.. దక్షిణాది అంటూ తను తరచూ వినిపించే వాదనను హార్వర్డ్ లోనూ వినిపించిన పవన్.. చాలామందిని కన్వీన్స్ చేశారని చెప్పాలి.
ఆయన ప్రసంగం విన్న తర్వాత.. నిజాయితీ ఉన్ననాయకుడ్నితాము చూసినట్లుగా పలువురు విద్యార్థులు పేర్కొనటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వేదిక మీద ప్రసంగించిన మరో హీరో మాధవన్.. తన హార్వర్డ్ లెక్చర్ అనుభవాన్ని చెబుతూ.. ‘‘ఎక్స్ ట్రీమ్లీ మెచ్చూర్ అండ్ రియల్లీ ఫన్నీ’’గా అభివర్ణించారు. హార్వర్డ్ లోని భారత విద్యార్థులు ఇచ్చిన అతిథ్యం చాలా బాగుందని.. అద్భుతమని ప్రశంసించారు మాధవన్. పనిలో పనిగా తన ప్రసంగాన్ని.. ఫోటోల్ని సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/