చేసే సంతకానికే మరో పేరే ఆటోగ్రాఫ్. ఈ సంతకాలకు వ్యక్తి హోదా.. పనితనం.. గుర్తింపును బట్టి దానికి విలువ పెరుగుతుంది. అధికారులకు గెజిటెడ్ సైన్ అని పిలుస్తుండగా ప్రముఖుల చేసే దానికి ఆటోగ్రాఫ్ అని పిలుస్తారు. సంతకానికి ఆటోగ్రాఫ్ అని పేరు చెప్పడానికి అతడు ఎంతో వృద్ధి చెందాలి. సమాజం గుర్తించిన వ్యక్తికి ఆటోగ్రాఫ్ పెట్టే అర్హత వస్తుంది. అలాంటి అర్హత సాధించడానికి ఎన్నో కష్టాలు పడాలి. ఈ ఆటోగ్రాఫ్ వెనుకాల ఉన్న కథను తాజాగా ఓ నటుడు ఎంతో ఆవేదనతో పంచుకున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చే నటుడు మాధవన్ ఆ విధంగా తాను చేయడానికి ఓ కారణం ఉందని చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలపగా తాజాగా దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇలా చెప్పుకొచ్చారు.
``అందరిలాగే ప్రముఖులతో ఆటోగ్రాఫ్ తీసుకోవాలని నాకు ఉండేది. ఒకసారి ఓ జాతీయ క్రికెటర్ దగ్గరకు వెళ్లాను. అప్పటికే ఓ 50 ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన ఆ క్రికెటర్ అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. నేను వెళ్లగానే సంతకం చేసి దాన్ని నాకు ఇచ్చారు. అయితే అప్పుడు అతడు నా వైపు కూడా చూడలేదు. అతడు చేసిందో తప్పో - ఒప్పో తెలీదు. కానీ ఆ సంఘటనతో చాలా బాధపడ్డా. అందుకే అప్పుడే డిసైడ్ అయ్యా. ఒకవేళ భవిష్యత్ లో నేను ఆటోగ్రాఫ్ చేయాల్సి వస్తే.. వారిని చూస్తూ చేయాలి`` అని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మాధవన్ తెలుగు.. తమిళ సినిమా పరిశ్రమలో దశాబ్దాల నుంచి ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.