విప్లవ చిత్రాలతో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ఒరవడి సృష్టించుకున్న దిగ్ధర్శకుడు ఆర్.నారాయణమూర్తి. నిజమైన పేదలు, ప్రజల కోసం సినిమాలు తీయడం అతడి ప్రత్యేకత. విజ్ఞానంతో అవిజ్ఞానంపై దండయాత్ర చేయడం అతడికి మాత్రమే చెల్లిన విద్య. ఎర్రజెండా ప్రత్యేకతను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించిన గొప్ప దర్శకుడు. అందుకే ఎంతమంది గొప్ప కమర్షియల్ దర్శకులు ఉన్నా నారాయణమూర్తి తనదైన బాణీని వినిపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎర్రసైన్యం, ఒరేయ్ రిక్షా, ఎర్ర సూరీడు అన్నిటిలో విప్లవ యోధుడిగా నారాయణమూర్తి సుపరిచితం. ఇటీవలే తెలంగాణ విప్లవం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలతో ఘనవిజయాలు అందుకున్నారు.
అయితే అంతటి నారాయణమూర్తికి టాలీవుడ్ స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెద్ద అభిమాని అన్న సంగతి కొద్దిమందికే తెలుసు. పవన్ హీరోగా తెరకెక్కించిన గంగతో రాంబాబు చిత్రాన్ని మూర్తి గారికే అంకితమిచ్చాడు పూరి. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిస్తున్న టెంపర్ చిత్రంలో నారాయణమూర్తి కోసం ఓ అద్భుతమైన పాత్రని డిజైన్ చేశాడు పూరి. అందులో నటించడానికి తనకి కూడా ఆసక్తి ఉందని చెప్పిన నారాయణమూర్తి ఎన్టీఆర్‌ని సైతం కలిశారు.
అయితే అనూహ్యంగా ప్రధాన కమర్షియల్ సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పేశారిప్పుడు. పూరి, ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని తృణ ప్రాయంగా వదులుకున్నారు. కమ్యూనిజం భావాలతో ఉన్న ఏ ఒక్కరూ కమర్షియల్ సినిమాని ఆహ్వానించలేరు. నారాయణమూర్తి కూడా అదే కోవలో ఈ సినిమాని వదులుకున్నారని అనుకోవాల్సిందే.