హీరో హీరోయిన్లు ఒక సినిమా కోసం ఒక స్పెషల్ లుక్ లోకి మారాలనుకుంటే.. వ్యక్తిగత ట్రైనర్లను పెట్టుకుని సాధన చేయడం మామూలే. ఒకే ట్రైనర్ కొన్ని నెలల పాటు కంటిన్యూ అయి.. ఒక పద్ధతి ప్రకారం ట్రైన్ చేస్తేనే అనుకున్న రిజల్ట్ వస్తుంది. ఐతే రాయ్ లక్ష్మీ మాత్రం ఒక సినిమా కోసం ఏకంగా 35 మంది ట్రైనర్లతో పని చేసిందట. ఆ సినిమా మరేదో కాదు.. ఆమె బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘జూలీ-2’. మామూలుగా కొంచెం బొద్దుగా ఉండే రాయ్ లక్ష్మీ ఈ సినిమా కోసం తన అవతారాన్ని చాలానే మార్చుకుంది. బరువు తగ్గి సన్నగా తయారైంది. బాలీవుడ్ భామలకు దీటైన ఫిజిక్ లోకి మారింది.
‘జూలీ-2’ సినిమాలో తాను ఒకే లుక్ లో కనిపించనని.. లావుగా.. మీడియం సైజులో.. సన్నగా.. ఇలా మూడు రకాల లుక్స్ లో దర్శనమిస్తానని.. ఇందుకోసం తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని రాయ్ లక్ష్మీ తెలిపింది. మామూలుగా తన డ్రెస్ సైజ్ ఎక్స్ ట్రా లార్జ్ అయితే.. అక్కడి నుంచి మీడియంకి.. ఆ తర్వాత స్మాల్ సైజ్ కి మారానని ఆమె చెప్పింది. ఈ క్రమంలో ఇండియాని వివిధ ప్రాంతాల్లోని 35 మంది ట్రైనర్ల ఆధ్వర్యంలో తాను ట్రైన్ అయినట్లు రాయ్ లక్ష్మీ వెల్లడించింది. ఐతే మరీ అంతమంది దగ్గర సలహాలు పొంది.. ట్రైన్ అయితే కలగాపులగం అయితే అసలుకే మోసం వచ్చేయలేదా? దీన్ని బట్టి చూస్తే రాయ్ లక్ష్మీ ఈ విషయాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తోందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.