అక్కినేని నాగచైతన్య.. రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'రా రండోయ్ వేడుక చూద్దాం' అనూహ్యమైన వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. లవ్ థీమ్ పై తనకు ఉన్న పట్టును మరోసారి పక్కాగా ప్రూవ్ చేశాడు చైతు. అన్ని ఏరియాల నుంచి రా రండోయ్ చిత్రానికి నిలకడగా వసూళ్లు వస్తుండడం విశేషం.
తొలి వారం ముగిసేనాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ ను రారండోయ్ కలెక్ట్ చేసింది. ఇక షేర్ అయితే 17.43 కోట్లు వసూలైంది. ఉత్తరాంధ్ర నుంచి 2.2 కోట్లు.. ఈస్ట్ 1.24 కోట్లు.. వెస్ట్ 89 లక్షలు.. కృష్ణా 1.14 కోట్లు.. గుంటూరు 1.21 కోట్లు.. నెల్లూరు 42 లక్షలతో మొత్తం ఆంధ్రా ఏరియాలో 7.1 కోట్లను రారండోయ్ వేడుక చూద్దాం వసూలు చేసింది. సీడెడ్ నుంచి 1.98 కోట్లు రాగా.. నైజాం నుంచి 5.16 కోట్లు వచ్చింది. కర్నాటక నుంచి 1.35 కోట్లు.. యూఎస్ఏ నుంచి 1.34 కోట్లు వచ్చాయి. మిగిలిన ఏరియాల నుంచి 50 లక్షల మేర కలెక్ట్ చేయగలిగింది.
సెకండ్ వీకెండ్ లో కూడా రా రండోయ్ సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వారం విడుదలైన సినిమాలేవీ ఆకట్టుకోలేకపోవడం.. రా రండోయ్ కు ప్లస్ పాయింట్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ జోరు చూస్తే.. సూపర్ హిట్ రేంజ్ గ్యారంటీ అనేస్తున్నారు ట్రేడ్ జనాలు. అన్నీ బాగుంటే ఇంతకు మించి కూడా వర్కవుట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/