తన ఫిజిక్ సినిమాలకు అస్సలు పనికి రాదని ఓపెన్ గా చెప్పేస్తోంది రాశి ఖన్నా. సాధారణంగా హీరోయిన్లు తనలా లావుగా ఉండరని ఆమె చెప్పింది. తన బాడీని ఫిట్ గా ఉంచుకోవడం చాలా కష్టమని ఆమె అంటోంది. ‘‘నేనున్న రంగానికి.. నా శరీర తత్వానికి అస్సలు నప్పదు. ఒక రకంగా చెప్పాలంటే నేను సినిమాలకు సరిపోను. హీరోయిన్లు ఎంత సన్నగా ఉంటే అంత అందమనుకుంటారు చాలామంది. కానీ గతంలో నాకున్న థైరాయిడ్ సమస్య వల్ల త్వరగా లావైపోయేదాన్ని. బరువు తగ్గడానికి అందరూ రోజూ గంట సేపు కష్టపడితే.. నేను రెండు గంటలు శ్రమించాల్సి వస్తుంది. రోజూ వ్యాయామం చేస్తేనే నా శరీరం నా మాట వింటుంది’’ అని రాశి ఖన్నా చెప్పింది.
ఐతే తాను చాలా తక్కువ తింటానని.. చిరుతిళ్ల జోలికి అస్సలు పోనని రాశి తెలిపింది. తనకు అమ్మ చేతి వంటంటే చాలా ఇష్టమని.. ఎక్కువ కాలం హోటళ్లలో తినడం ఇష్టం లేక తన తల్లిని హైదరాబాద్ కు తీసుకొచ్చేశానని రాశి వెల్లడించింది. ఇక తన అభిరుచుల గురించి చెబుతూ.. తనకు పాములంటే మహా సరదా అని రాశి ఖన్నా చెప్పడం విశేషం. ‘‘చాలామంది అమ్మాయిలు పాములకు భయపడుతుంటారు. కానీ నాకు మాత్రం కోరలు తీసిన పాముల్నీ - చిన్న కొండ చిలువల్నీ చేతిలోకి తీసుకొని ఆడటమంటే మహా సరదా. కొన్ని దేశాల్లో వాటిని ఇంట్లో పెంచుకునే సౌలభ్యం ఉంటుంది. మన దగ్గర కుదరదు కాబట్టి వాటిని ఇంటికి తెచ్చుకోలేకపోతున్నా’’ అని వాపోయింది రాశి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/