ఫోటో స్టొరీ: ఫోకస్ అండ్ సరెండర్!

Update: 2019-03-10 05:45 GMT
బ్యూటిఫుల్ రాశి ఖన్నా ఇప్పుడు వెంకటేష్ - నాగ చైతన్య మల్టిస్టారర్ 'వెంకీమామ' సినిమా లో నటిస్తూ యమా జోష్ లో ఉంది. ఈ సినిమాలో చైతూకు జోడీగా నటిస్తోంది రాశి.  ఈ సినిమా షూటింగ్ కోనసీమలో జరుగుతుండడంతో అక్కడి పచ్చటి పొలాల్లో ఒక ఫోటో తీసుకొని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  తాజాగా మరోసారి ఫోటోలు పోస్ట్ చేసింది కానీ ఈసారి నేపథ్యం పచ్చటి పొలాలు కాదు.. పల్లెటూరి సహజ వాతావరణం.

గ్రే కలర్ టాప్.. అదే రంగుతో ఉన్న లాంగ్ మిడ్డీ ధరించి ఒక పాత ఇల్లు బ్యాక్ గ్రౌండ్ లో పోజిచ్చింది.  ఒక డార్క్ కలర్ స్ట్రైప్స్ ఉన్న షర్ట్ ను పైన వేసుకొని ఒక సెన్సువల్ పోజిచ్చింది.  రాశి డ్రెస్ కలర్ కు మ్యాచ్ అయ్యేలా ఎండిపోయిన ఆకుల మధ్యనుంచి ఫోటో తీయడంతో కళాత్మకంగా ఉంది. అతితక్కువ మేకప్ తో దర్శనమిచ్చిన రాశి వాచ్ తప్ప ఇతర యాక్సెసరీస్ ఏవీ ధరించలేదు.  సెట్స్.. కలర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సాధారణంగా ఉండే డ్రై గా పరిసరాలలో ఇలాంటి ఫోటో తీయడం గొప్ప విషయమే.  ఈ ఫోటోకు రాశి ఖన్నా ఇచ్చిన క్యాప్షన్ 'ఫోకస్ అండ్ సరెండర్'.  నిజమే.. ఫోటోలో ఉన్న ఆమె అందాలపై ఫోకస్ చేసిన మగ నెటిజనులు ఆమెకు 'సరెండర్' కాకుండా ఎలా ఉంటారు?

'వెంకీమామ' తో పాటు రాశి ఖన్నా తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న  'అయోగ్య' సినిమాలో నటిస్తోంది.   ఎన్టీఆర్ సినిమా 'టెంపర్' రీమేకే ఈ 'అయోగ్య'.   ఈ సినిమాతో పాటు ఆ సిద్ధార్థ్ హీరోగా నటించే 'షైతాన్ కా బచ్చా' లో కూడా రాశి హీరోయిన్.


Tags:    

Similar News