టాలీవుడ్ లో టెంపర్ మూవీ ఓ సెన్సేషన్. సమకాలీన కథాంశాన్ని ఎంత అద్భుతంగా చెప్పచ్చో చూపించిన మూవీ. అలాగే ఎన్టీఆర్ కెరీర్ ను సక్సెస్ బాట పట్టించిన మూవీ ఇది. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు చాలానే డిమాండ్ ఉంది. టెంపర్ హిందీ రీమేక్ లో రణవీర్ సింగ్.. తమిళ్ రీమేక్ లో విశాల్ నటిస్తున్నారు. వీరి వరకూ ఓకే కానీ.. హీరోయిన్ల పేర్లు భలే ఎట్రాక్టివ్ గా వినిపిస్తున్నాయి.
హిందీ కోసం మొదట వైరల్ వింక్ లేడీ ప్రియా వారియర్ పేరు వినిపించగా.. ఆ తర్వాత సారా ఆలీ ఖాన్ ఖరారైందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు తమిళ్ రీమేక్ లో హీరోయిన్ గా రాశి ఖన్నా ఎంపికైంది. ఈ విషయాన్ని చెప్పిన రాశి ఖన్నా.. టెంపర్ రీమేక్ లో ఛాన్స్ రావడంపై చాలా సంతోషం అంటోంది. అంతే కాదు.. తొలిప్రేమ తర్వాత మళ్లీ తనకు బోలెడు గుర్తింపు తెచ్చిపెట్టే పాత్ర అవుతుందని కూడా అంటోంది. ఈ పేర్లు సంతోషాలు సరే కానీ.. అసలింతకీ ఆ రోల్ లో ఏముందన్నదే ప్రశ్న.
టెంపర్ మూవీలో కాజల్ అగర్వాల్ ది నామ్ కే వాస్తే రోల్ అంతే. నాలుగు పాటలు.. మూడు రొమాన్స్ సీన్స్.. అంతకు మించి చెప్పుకుంటే.. సినిమా కథకు ఒక్కటంటే ఒక్క సీన్ లో మాత్రమే అవసరం అయే పాత్ర. ఆ అవసరం కూడా అతకబెట్టినది మాత్రమే. మరి ఆ మాత్రం రోల్ కే అందరికీ ఇంత ఎగ్జయిట్ ఎందుకు అయిపోతున్నారో.. అంతగా గుర్తింపు తెచ్చిపెట్టేసే ఆ రోల్ కు ఏముందో అర్ధం కాని విషయం.