రాశీ ఖన్నా ఇదేం సంప్రదాయం?

Update: 2018-08-14 06:43 GMT
విమర్శలను స్వీకరించడం, వాటికి సరిగ్గా సమాధానం చెప్పడం అందరి వల్లా అయ్యేపని కాదు.  అందుకే అరిస్టాటిల్ అనే ప్రముఖ గ్రీకు తత్వవేత్త విమర్శలను ఎలా హ్యాండిల్ చేయాలో ఒక చిట్కా చెప్పాడు. అదేంటంటే కామ్ గా... మారు మాట్లాడకుండా ఉండటం. అసలు రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండడం.  చూడండి.. ఒకరు  మనల్నివిమర్శిస్తారు. మనం సమాధానం చెప్తాం.. వాడు ఇంకోటి చెప్తాడు. అదే మనం కామ్ గా ఉంటే ఇక అవతలివాడు విమర్శించి విమర్శించి అలసి పోయి.. విమర్శించేందుకు మన బదులు కొత్త మనిషిని వెతుక్కుంటాడు!

పాపం ముంబై బ్యూటీ రాశి ఖన్నాకు ఈ గ్రీకు తత్వవేత్త పరిచయం లేడేమో.. అందుకే తన తాజా చిత్రం 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కొచ్చిన రివ్యూలు.. విమర్శలను తట్టుకోలేకుండా ఉంది.  ఆ సినిమా ప్రేక్షకుల పేషన్స్ కు పేద్ద పరీక్ష పెట్టిందని ఇప్పటికే టాక్ ఉంది. కానీ కొందరు సినిమాను ఇష్టపడ్డవాళ్ళు కూడా ఉంటారు కదా.  అలాంటి ఫ్యాన్స్ కొందరు ట్విట్టర్ లో 'శ్రీనివాస కళ్యాణం' కు నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళను తిట్టారు.  కొందరు మరింత దూరం వెళ్లి నెగటివ్ గా రాసిన రివ్యూయర్లను బాస్టర్డ్స్ అని తిట్టారు.  ఆ ట్వీట్ లకు మన రాశి ఖన్నా లైకులు కొట్టింది!

తన సినిమాకు రెస్పాన్స్ సరిగా లేకపోతే బాధ ఉంటుంది కానీ... దానికి రివ్యూయార్లు ఏం చేస్తారు.. వాళ్ళ డ్యూటీ వాళ్ళది. 'ఈ సినిమాను ఆస్కార్ కి పంపాలి.. క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాను రిఫరెన్స్ గా తీసుకోవాలి' అని అయితే రాయలేరు కదా.  విమర్శించిన వాళ్ళది తప్పే అయితే..  రాశి నటించిన 'తొలి ప్రేమ' కు వాళ్ళే మంచి రివ్యూలు ఇచ్చారు కదా?

అంతా బాగానే ఉంది కానీ 'బాస్టర్డ్స్' అంటే.. కొంపదీసి 'బకార్డీ' అని పుసుక్కున అనుకొని కసక్కని లైక్ కొట్టిందా?
Tags:    

Similar News