రంగుల ప్రపంచంలో కలల్ని నిజం చేసుకునేందుకు ఎందరో భామలు ఇంట్లోవాళ్లతో ఘర్షణ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి ఘర్షణలో తమ డ్రీమ్ ని నెరవేర్చుకునేందుకు తల్లిదండ్రులను వ్యతిరేకించి దూరంగా వెళ్లే సన్నివేశం ఎదురవుతుంది. ఇలా ఎందరో భామలు రంగుల పరిశ్రమలో తమ కలల్ని నెరవేర్చుకునేందుకు నగరాలకు షిఫ్ట్ అయ్యే సీన్ చూస్తున్నదే. అందరిలానే రాశీ ఖన్నా కూడా తల్లిదండ్రులను వ్యతిరేకించాల్సి వచ్చిందట.
ఆ క్రమంలోనే అమ్మా నాన్నలపై మమకారంతో వారిని విడిచి రావాల్సిన పరిస్థితిలో ఎంతో హృదయవేదనకు గురైందట. దాంతో ఎంతో బాధతో ఏడ్చేసిందట. అంతేకాదు.. డిప్రెషన్ కి గురయ్యానని తెలిపింది. కానీ లైఫ్ లో ఇలాంటివన్నీ చాలా కామన్ అని కూడా చెబుతోంది. ఇక తన జీవిత గమ్యం గురించి తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు కూడా సెట్ రైట్ అయ్యారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
నిజమే ఆరోజు అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు కథానాయిక అయ్యేదా? ఇక్కడ ఇంత పెద్ద స్టార్ డమ్ ని ఆస్వాధించే అవకాశం దక్కి ఉండేదా? అంటే చెప్పలేం. లైఫ్ అంటేనే ఇలాంటి ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయి. అన్నిటినీ ఎదుర్కొని ఎదగాల్సి ఉంటుంది. నాగశౌర్య సరసన ఊహలు గుసగుసలాడే చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసిన రాశీ తొలుత బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించింది. అటుపై టాలీవుడ్ లో పెద్ద స్టార్ అయ్యింది మరి. వెంకీమామ- ప్రతిరోజూ పండగే చిత్రాలతో హిట్లు కొట్టింది. రాశీ ప్రస్తుతం తదుపరి కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందట.