రాశి భలే నాజూగ్గా తయారైందే!!

Update: 2017-04-01 04:30 GMT
టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నాకు మొదటి సినిమా నుంచి ఫాలోయింగ్ విపరీతంగా వచ్చింది. అందులో చాలావరకూ అవకాశాలుగా కూడా మారాయి. కుర్ర హీరోలకు ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. ఖాతాలో హిట్స్ కూడా బాగానే పడ్డాయి. కానీ స్టార్ హీరోయిన్ అనిపించుకునేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది రాశి.

ఇందుకు కారణం అమ్మడి పర్సనాలిటీ అంటారు ఇండస్ట్రీ జనాలు. కాసింత భారీ దేహం కావడంతో.. స్టార్స్ ఈమెను ఇన్నాళ్లు దగ్గరకు రానీయలేదు. కానీ ఓ ఏడాదిగా మాత్రం బాడీపై ఫిట్నెస్ పై బాగానే దృష్టి పెట్టింది. తగ్గిందనే సంగతి తెలుసు కానీ.. ఏ స్థాయిలో తగ్గిందనే విషయంలో మాత్రం.. తాజాగా జరిగిన ఐఫా ఉత్సవంలో అందరికీ అర్ధమైంది. ఇక్కడ డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసిన ఈ బ్యూటీ.. అంతకు ముందుకు మేకప్ రూమ్ లో దిగిన ఫోటో ఇది. కాస్ట్యూమ్స్.. ఆర్నమెంట్స్ ఎంత గ్రాండ్ గా ఉన్నాయో.. అంతకు మించి గ్రాండ్ గా ఉంది రాశి ఖన్నా అందం.

నాభి సోగయంతో పాటు నడుం ఒంపులు కనిపించేలా డ్రెసింగ్ చేసింది కానీ.. ఇక్కడ అమ్మడి టార్గెట్ ఏంటంటే.. తాను ఏ రేంజ్ లో తగ్గిందో.. ఏ స్థాయిలో స్టార్ మెటీరియల్ గా మారుతోందో చెప్పడమే. ఈ కటౌట్ చూశాక.. అమ్మడిలో కంటెంట్ అర్ధమయ్యాక.. రాశి ఖన్నాకు స్టార్ హీరోల నుంచి వరుసగా పిలుపులు రావడం ఖాయం. ఇప్పటికే ఎన్టీఆర్ పక్కన లీడ్ హీరోయిన్ గా ఓ ఛాన్స్ దక్కించుకున్న రాశికి.. ఇక వరుసగా అవకాశాలు వస్తాయేమో చూడాలి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News