తమిళ టెంపర్ లో తొలిప్రేమ బ్యూటీ

Update: 2018-08-23 10:14 GMT
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు బ్లాస్టింగ్ హిట్ గా మిగిలిన టెంపర్ అభిమానులకు సైతం ఒక స్వీట్ మెమరీ. లంచాలు మరిగి తర్వాత మార్పు చెందే పోలీస్ ఆఫీసర్ గా తారక్ విశ్వరూపం వన్ అఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఇతర భాషల్లో రీమేక్ ప్రయత్నాలు ఇప్పుడిప్పుడు ఒక కొలిక్కి వస్తున్నాయి. హిందీలో రన్వీర్ కపూర్ హీరోగా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా జోడిగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ పాటికే సగం షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ చివరి వారంలో అది విడుదల కానుంది. ఈ రోజు తమిళ వెర్షన్ కూడా కొబ్బరికాయ కొట్టేశారు. విశాల్ హీరోగా రూపొందే ఈ మూవీకి అయోగ్య అనే టైటిల్ ఫిక్స్ చేసారు. సాధారణంగా తెలుగులో ఈ పదానికి అర్థం పనికిరానివాడు. కావాలని అలా పెట్టారో ఏమో కానీ జనం దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. ఇవాళ లాంఛనంగా షూటింగ్ మొదలుపెట్టుకున్న అయోగ్య తెలుగు రీమేక్ కాబట్టి డబ్బింగ్ వచ్చే ఛాన్స్ లేదు.

ఇక ఇందులో హీరోయిన్ గా రాశి ఖన్నాను తీసుకున్నారు. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నల్లనయ్య విశాల్ ఈ మధ్య మంచి యాపిల్ బ్యూటీస్ అందరితో వరసబెట్టి చేస్తున్నాడు. తమన్నా-సమంతా-కీర్తి సురేష్ ఇలా టాప్ లీగ్ స్టార్ హీరోయిన్స్ అందరిని ఒక్కొక్కరిగా తన సినిమాల కోసం తీసుకుంటున్నాడు. తొలిప్రేమతో కొత్త మేకోవర్ లో ఫామ్ లోకి వచ్చిన రాశి ఖన్నాకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సామ్ సంగీత దర్శకుడు. విజయ దేవరకొండ నోటాకు మ్యూజిక్ ఇస్తోంది కూడా ఇతనే. విక్రమ్ వేదాతో మంచి పేరు తెచ్చుకున్న సామ్ దీనికి మరో ఆకర్షణగా మారుతున్నాడు. విలన్లు తదితర వివరాలు ఇంకా రావాల్సి ఉంది. విశాల్ పందెం కోడి 2 దసరా సందర్భంగా అక్టోబర్ 18 ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. అభిమన్యుడుతో లైన్లోకి వచ్చిన విశాల్ ఇకపై గ్యాప్ ఇవ్వనంటున్నాడు.
Tags:    

Similar News