'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. తొలి చిత్రంతోనే యువ హృదయాలను దోచుకుంది. అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఓవైపు సౌత్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అంతేకాదు డిజిటల్ స్పేస్ లోనూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది.
రాశీ ఖన్నా ''రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్'' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కు కూడా ఇది ఓటీటీ డెబ్యూ. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రాజేష్ మపుస్కర్ ఈ సిరీస్ ను రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబడిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
'లూథర్' అనే పాపులర్ బ్రిటీష్ వెబ్ సిరీస్ ఆధారంగా రూపొందిన ''రుద్ర'' వెబ్ సిరీస్ లో రాశీ ఖన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. డిఫెరెంట్ లుక్ మరియు క్యారక్టరైజేషన్ తో కూడా పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సిరీస్ లో ఆమె అభినయానికి గాను ఒక ప్రైవేట్ మీడియా హౌస్ నుండి నెగెటివ్ రోల్ లో ఉత్తమ నటి కేటగిరీలో అవార్డ్ అందించింది.
రాశీ ఖన్నా తన డెబ్యూ వెబ్ సిరీస్ తో అవార్డ్ సాధించిన విషయాన్ని వెల్లడిస్తూ.. సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. చేతిలో అవార్డ్ తో ఉన్న ఓ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అజయ్ దేవగన్ తో సహా ''రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్'' టీమ్ మొత్తానికి తన కృతజ్ఞతలు తెలియజేసింది.
''ఇది ప్రత్యేకమైనది. 'రుద్ర' కోసం 'నెగటివ్ రోల్ లో ఉత్తమ నటి' అవార్డుతో నన్ను సత్కరించినందుకు ధన్యవాదాలు. నేను ఈ సిరీస్ కు సైన్ చేసినప్పుడు, ఈ పాత్రను పోషించడం నిజంగా సరైనది లేదా పూర్తిగా తప్పు అని నాకు తెలుసు. నేను నమ్మినందుకు ఇప్పుడు, ప్రజలు వారి హృదయాలలో స్థానం కల్పించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను! 'అలియా చోక్సీ' పై ఇంత ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు పెద్ద కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచినందుకు.. నాకు సపోర్ట్ గా నిలిచినందుకు సమీర్ సార్ - రాజేష్ ముపుస్కర్ సార్ - అజయ్ దేవ్ గన్ సర్ సహా మొత్తం టీమ్ కి ధన్యవాదాలు!'' అని రాశీ ఖన్నా పేర్కొంది.
ఇకపోతే రాశీ ఖన్నా ఈ ఏడాది 'పక్కా కమర్షియల్' 'థాంక్యూ' 'తిరు' 'సర్దార్' వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో కలిసి 'ఫర్జి' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రాజ్ - డీకే రూపొందించిన ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక దాదాపు పదేళ్ల తర్వాత 'యోధ' అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడానికి రాశీ రెడీ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.