యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలు ప్రభాస్ పెదనాన్న అయిన రెబల్ స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇదే సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ మిథున్ చక్రవర్తి కూడా కనిపించబోతున్నాడు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరు కనిపించబోతున్నది నిజమే. కాని ఒకరు కనిపిస్తే మరొకరు కనిపించరట. టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రాధేశ్యామ్ తెలుగు మరియు సౌత్ వర్షన్ లలో ఆ పవర్ ఫుల్ పాత్రలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కనిపించబోతున్నారు. అదే పవర్ ఫుల్ హిందీ వర్షన్ పాత్రలో మాత్రం కృష్ణం రాజుకు బదులుగా మిథున్ చక్రవర్తి కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రభాస్ కృష్ణం రాజు మరియు ప్రభాస్ మిథున్ చక్రవర్తిల కాంబో సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయని అంటున్నారు. సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఆ పాత్ర ఉంటుందని.. సినిమాకు ఆ పాత్ర అంత ప్రాముఖ్యతను కలిగి ఉంది కనుక హిందీ వర్షన్ కోసం ప్రత్యేకంగా మిథున్ చక్రవర్తిని రంగంలోకి దించినట్లుగా చెబుతున్నారు. ప్రభాస్ మరియు కృష్ణం రాజులను కలిసి చూడాలనుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా కన్నుల వింధు. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా మిథున్ చక్రవర్తి అప్పియరెన్స్ ను ఎంజాయ్ చేస్తారు అనడంలో సందేహం లేదు. సినిమా చిత్రీకరణ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా పై ఏమాత్రం బజ్ తగ్గకుండా ఓ రేంజ్ లో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.
కరోనా కారణంగా దాదాపుగా ఏడాదిన్నర ఆలస్యం అవుతున్న ఈ సినిమా ను ఎట్టకేలకు సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా డేట్లు కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రాధే శ్యామ్ సినిమా పీరియాడిక్ డ్రామాగా సాగుతుందని అంటున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో పలు విషయాలను సస్పెన్స్ గా ఉంచారు. సినిమాలు మొదలుకుని పలు విషయాల్లో చాలా స్పెషల్ గా ఉంటుందని... హిందీ మరియు సౌత్ వర్షన్ కు చాలా మార్పులు చేర్పులు చేసినట్లుగా చెబుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ తో పాటు సౌత్ స్టార్స్ పలువురు కనిపించబోతున్నారు. సినిమా ఆలస్యం అయితే సహజంగా విమర్శలు వస్తాయి. కాని రాధేశ్యామ్ సినిమా ఆలస్యం అవుతున్నా కూడా పాజిటివ్ వైబ్స్ మాత్రమే ఉన్నాయి.