ప్రభాస్.. రాధాకృష్ణల కాంబోలో రూపొందిన 'రాధేశ్యామ్' సినిమా కోసం అభిమానులు సుదీర్ఘ కాలంగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అదుగో ఇదుగో అంటూ కరోనా పేరు చెప్పి.. అంతకు ముందు మరేదో కారణం చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేశారు. సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన రాధేశ్యామ్ ను అడ్డుకున్న కరోనా ఇప్పుడు కనిపించకుండా పోయింది. దాంతో రాధేశ్యామ్ వెంటనే బాక్సాఫీస్ వార్ కు సిద్దం అయ్యింది.
విక్రమాధిత్య అనే ఒక జోతిష్యుడిగా ప్రభాస్ ఈ సినిమా లో కనిపించబోతున్నాడు. విధి రాతను ఎదురించేందుకు ప్రయత్నించగా ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో ఒక అందమైన ప్రేమ కావ్యంలా ఈ సినిమాను రూపొందించినట్లుగా దర్శకుడు రాధాకృష్ణ చెబుతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు ప్రభాస్ పాన్ ఇండియా పాన్స్ ను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు.
సినిమా విడుదలకు మరో వారం రోజుల సమయం ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు. రెండు రోజుల పాటు ముంబైలో సందడి చేసిన ప్రభాస్ మరియు పూజా హెగ్డే లు ఇప్పుడు చెన్నై లో ల్యాండ్ అయ్యారు. చెన్నై లో మీడియా సమావేశాలతో పాటు ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉండబోతున్నారు. చెన్నై లో కూడా దాదాపుగా రెండు రోజుల పాటు రాధేశ్యామ్ టీమ్ సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేయడం లో ఇప్పటికే సక్సెస్ అయిన రాధేశ్యామ్ తప్పకుండా ప్రతి రాష్ట్రంలో కూడా భారీగా వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అనే నమ్మకంతో బయ్యర్లు నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో మరింత పీక్స్ కు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాధేశ్యామ్ సినిమా లో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. షూటింగ్ సమయంలో ఆమె తో యూనిట్ సభ్యులకు విభేదాలు తలెత్తాయి అనే పుకార్లు షికార్లు చేశాయి. కాని అవేవి నిజం కాదు అంటూ పూజా హెగ్డే ప్రభాస్ తో కలిసి సరదాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ప్రభాస్ మరియు పూజాలు కలిసి ముంబైలో సందడి చేశారు.. ఇప్పుడు చెన్నై లో ఆ తర్వాత హైదరాబాద్ లో మీడియా ముందుకు రాబోతున్నారు.
ప్రభాస్ సాహో తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకుని ఈ సినిమా తో రాబోతున్నాడు. అయితే రాధేశ్యామ్ తర్వాత మాత్రం ఏమాత్రం గ్యాప్ ఉండబోవడం లేదు. ఇప్పటికే ప్రభాస్ సినిమా లు ఆదిపురుష్.. సలార్.. రాజా డీలక్స్.. ప్రాజెక్ట్ కే.. స్పిరిట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమా లు క్యూ లో ఉన్నాయి. ఈ ఏడాది లో రాధేశ్యామ్ తో పాటు మరో సినిమా లేదా రెండు సినిమా లు కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది కూడా రెండు లేదా మూడు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులకు రాబోయే రెండు మూడు ఏళ్లు పండుగే అనడంలో సందేహం లేదు.