'రాధేశ్యామ్' ర‌న్ టైమ్ లాక్డ్.. మొత్తం ఎన్నిగంట‌లంటే?

Update: 2022-03-04 04:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `రాధేశ్యామ్` రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్  అయింది.  రిలీజ్ కి ఇంకా వారం రోజులే.  స‌మ‌యం  ద‌గ్గ‌ర‌ప‌డే కొద్ది అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. రిలీజ్ గ‌డియ‌లు కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. మార్చి 11 ఎప్పుడొస్తుందా? అని ఒక‌టే ఉత్కంఠ‌గా ఉన్నారు. తాజాగా సినిమా సెన్సార్ ప‌నుల్ని పూర్తిచేసుకుంది.

సెన్సార్ నుంచి U/A స‌ర్టిఫికెట్ జారీ అయింది. సినిమా  క్రిస్పీ ర‌న్ టైమ్ తో లాక్ అయింది.  సినిమా మొత్తం ర‌న్ టైమ్  2 గంట‌ల 18  నిమిషాలు. ర‌న్ టైమ్ ఎక్కువ‌ని వ‌చ్చిన‌ విమ‌ర్శ‌లన్నింటికి  యూనిట్ పుల్ స్టాప్ పెట్టేసింది. సెన్సార్ టాక్ పాజిటివ్ గా వ‌చ్చింది. విజువ‌ల్ ట్రీట్ పై ప్ర‌శంస‌ల అందుకుంది.  ఇక థియేట‌ర్లో రెండు గంట‌ల 18 నిమాషా ఆస్వాద‌న‌కు ప్రేక్ష‌కులు సిద్ద‌మ‌వ్వాలి. ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌చార చిత్రాలు అంచ‌నాల్ని అంత‌కంత‌కు పెంచేసాయి.

టీజ‌ర్..ట్రైల‌ర్..పోస్ట‌ర్లు  సినిమాకి మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. ఇట‌లీ అందాలు..భారీ సెట్లు.. పాత కాల‌పు డిజైన్స్ ..అద్భుత‌మైన వింటేజ్ బ్యాక్ డ్రాప్ స‌న్నివేశాలు ట్రైల‌ర్ తోనే హైలైట్ అయ్యాయి. రెండు గంట‌ల  ఎంట‌ర్ టైన్ మెంట్ లో ప్రేక్ష‌కాభిమానుల‌కు మ‌రింత కిక్ త‌ప్ప‌నిస‌రి టాక్ వినిపిస్తోంది. పీరియాడిక్ ల‌వ్ స్టోరీలో ప్ర‌భాస్-పూజాహెగ్డే ల మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని టీమ్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. అలాగే యాక్ష‌న్ స‌న్నివేశాలు అంతే అస్సెట్ గా నిలుస్తాయ‌ని  తెలుస్తోంది.

రాధేశ్యామ్` పీరియాడిక్ ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో తెరకెక్కిన  యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ఈ చిత్రాన్ని `జిల్` ఫేం రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించారు. ఈ సినిమా కోసం టీమ్ దాదాపు రెండు సంవత్స‌రాలు పాటు ప‌నిచేసింది. కేవ‌లం షూటింగ్ కోస‌మే చాలా స‌మ‌యం కేటాయించింది.  ఫ‌స్ట్ క్లాస్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకి ప‌నిచేసారు.

ఏకంగా ఒకే సినిమాకి  ఐదారుగురు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌డం టాలీవుడ్ సినిమా చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి. పాన్ ఇండియా అప్పీల్ కి ప‌ర్పెక్ట్ అప్పీరియ‌న్స్ ఇచ్చేలా టీమ్ అన్ని ర‌కాలుగా సినిమా కోసం నిష్ణాతుల్ని రంగంలోకి దింపింది. ఇక   నిర్మాణ ప‌రంగానూ యూవీ క్రియేష‌న్స్ ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేసింది. ప్ర‌భాస్ పాన్ ఇండియా క్రేజ్ నేప‌థ్యంలో బిజినెస్ పెద్ద ఎత్తున జ‌రిగింది. ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చినా కేవ‌లం థియేట‌ర్లో మాత్ర‌మే రిలీజ్ చేయాల‌ని  టీమ్ ఫిక్సై ముందుకెళ్లింది. ఫైన‌ల్ గా ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. పాన్ ఇండియా వైడ్  మార్చి 11న  బాక్సాఫీస్ పోరుకి రెడీ అయింది.  


Tags:    

Similar News