పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ ఎంటర్ టైనర్ `రాధేశ్యామ్`. దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా ఇది. అయితే పాన్ ఇండియా స్థాయికి మించి ఇండియన్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాధాకృష్ణ కుమార్ భారీ ఆశలు పెట్టుకున్న ఈ మూవీని యువీ క్రియేషన్స్, టి సిరీస్ సంస్థలు దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాయి. చాలా కాలంగా ప్రబాస్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబతోంది.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని ప్రారంభించేసింది. ఇటీవల లిరికల్ వీడియోని విడుదల చేసిన ఇచత్ర బృందం మార్చి 2 నుంచి అసలు ప్రమోషన్స్ కి తెరలేపబోతున్నామంటూ ఇండైరెక్ట్ గా ప్రకటించింది. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ ట్రైలర్ తో `రాధేశ్యామ్` ప్రమోషన్స్ ని ప్రారంభించింది. ముంబైలో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో `రాధేశ్యామ్` రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే ప్రత్యేక ఆకర్ణణగా నిలిచారు.
`మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం... మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయి.. అంటూ ప్రభాస్ వాయిస్ తో టెర్రిఫిక్ విజువల్స్ తో రిలీజ్ ట్రైలర్ మొదలైంది. చెయి చూసి ఫ్యూచర్ ని.. వాయిస్ విని పాస్ట్ ని కూడా చెప్పేస్తావా?.. అని సచిన్ ఖేకేడర్ చెబుతున్న డైలాగ్ లు... ఈనె ఎలా ఎప్పుడు చనిపోతాడో చెప్పనా... నాకు రెండోసారి చూసే అలవాటు లేదు.. అంటూ ప్రభాస్ చెబుతున్న తీరు ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు... అని పూజా హెగ్డే పాత్ర తో చెప్పించిన డైలాగ్ లు ... ట్రైలర్ చివర్లో `ప్రేమకీ విధికీ మధ్య జరిగే యుద్ధమే .. `అంటూ దర్శక ధీరుడు రాజమౌళి అందించిన వాయిస్ ఓవర్ వెరసి `రాధేశ్యామ్` రిలీజ్ ట్రైలర్ స్పెక్టాకులర్ గా వుంది.
ఒక విధంగా ఈ ట్రైలర్ లో కథని మొత్తం చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ట్రైన్ ట్రాక్ తప్పిన తీరు.. సముద్రంలో ఓడ మునిగిపోతున్న దృశ్యాలు ప్రేక్షకులని సరికొత్త లోకంలో విహరిస్తున్న ఫీల్ ని కలిగించేలా వున్నాయి. మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్టుగానే సునామీ నేపథ్యంలో చిత్రీకరించిన పతాక ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయి. యూరప్ నేపథ్యంలో సాగే హెరిటేజ్ పిరియాడిక్ రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్ గా కనువిందు చేయడం కాయంగా కనిపిస్తోంది.
ఇండియన్ ఎమర్జెన్సీ కాలాన్ని ముందే చెప్పి షాకిచ్చిన ఓ ప్రముఖ పాలమిస్ట్ ప్రేమకథగా ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. ప్రెసిడెంట్ లతో పాటు ప్రధానికి కూడా హస్తం చూసి జరగబోయేది చెప్పే యువకుడిగా ఇందులో ప్రభాస్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు విడుదలైన ట్రైలర్ ఈ విషయాల్ని ముందే స్పష్టం చేసినా తాజా ట్రైలర్ లో చిత్ర కథని దాదాపుగా రివీల్ చేయడం.. విధిని ఎదరించి ప్రేమని దక్కించుకున్న యువకుడిగా ప్రభాస్ ని చూపించిన తీరు.. ఓడ మునిగిపోతుంటే అబ్బుర పరిచే స్థాయిలో ప్రభాస్ చేస్తున్న విన్యాసాలు సినిమా ఓ రేంజ్ లో వుండబోతోందనే సంకేతాల్ని అందిస్తోంది. మార్చి 11న విడుదల కానున్న ఈ మూవీ ఊహలకందని స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుందా? అన్నది వేచయి చూడాల్సిందే.