అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ రాధే శ్యామ్. మాయదారి కరోనా పుణ్యమా అని రెండేళ్లుగా పలు క్రేజీ మూవీలు రిలీజ్ లు వాయిదా మీద వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతూ.. ప్రేక్షకుల ఆకలిని తీరుస్తున్నాయి.
ఈ వారం విడుదల అవుతున్న ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ మీద అంచనాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ సినిమా స్థాయిని మరో రేంజ్ కు తీసుకెళ్లటమేకాదు.. ఇప్పటివరకు ఉన్న రికార్డుల్ని బద్ధలు కొట్టే అవకాశం ఉందంటున్నారు.
వింటేజ్ లవ్ స్టోరీగా ఉంటుందని భావిస్తున్న ఈ మూవీకి సంబంధించి తొలి రివ్యూ బయటకు వచ్చింది. సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉందన్న విషయాన్ని తనకు తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబరుగా చెప్పుకునే ఉమైర్ సంధు అనే సినీ విశ్లేషకుడు తాజాగా రాధే శ్యామ్ మూవీ రివ్యూను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ సినిమాను తాను చూశానని.. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని.. ప్రభాస్ -పూజల కెమిస్ట్రీ ఎలక్ట్రిఫైయింగ్ గా అనిపించినట్లు పేర్కొన్నారు. ఇదో యూనిక్ సబ్జెక్టుగా పేర్కొన్న అతడు.. సినిమా క్లైమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని పేర్కొన్నాడు. ‘క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’ అంటూ రాధే శ్యామ్ ను ఎలా ఉంటుందో చెప్పేశారు.
మూవీలో ప్రభాస్ ఇరగొట్టేశాడని.. అతడి డ్రెస్సింగ్.. యాక్టింగ్ అద్భుతమని.. భారత్ లో ప్రభాస్ క్లాస్.. స్టైల్ ను బీట్ చేసే వారు ఎవరూ లేరన్న మాటలు డార్లింగ్ అభిమానులకు గాల్లో తేలేలా చేస్తాయని చెప్పక తప్పదు. ఇప్పటికే సినిమా మీద ఉన్న భారీ అంచనాలను మరింత పెంచేలా తొలి రివ్యూ ఉందన్న మాట వినిపిస్తోంది.
ప్రభాస్ - పూజా హెగ్డేలు జంటగా నటించిన ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏమంటే.. అలనాటి ప్రేమ పావురాలు సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటించింది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ మీద అంచనాలు భారీగా ఉన్నాయని చెప్పొచ్చు.