యంగ్ రెబల్ స్టార్ ..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా `రాధేశ్యామ్` మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. `బాహుబలి` తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారింది. మారిన ఇమేజ్.. రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఆయన నటించిన `రాధేశ్యామ్` చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలకు మించి వుంది.
`జిల్` ఫేమ్ రాధాకృష్ణకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై యువీ కృష్ణంరాజు సమర్పణలో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో రూపొందించారు. `రాధేశ్యామ్` కేవలం రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే సినిమా మాత్రమే కాదు.. ఇందుకు అంతకు మించి వుంటుందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. ఇందులో కొన్ని నేచర్ ఎలిమెంట్స్ ని కూడా చూపించబోతున్నట్టు మేకర్స్ టీజర్ ద్వారా స్పష్టం చేశారు.
టీజర్‌లో ప్రభాస్ పామిస్ట్ అంటే హస్తముద్రికా నిపుణుడుగా చేతి రేఖలని బట్టి ఎదుటి వ్యక్తి భవిష్యత్తుని చెప్పే వ్యక్తిగా విక్రమాదిత్య పాత్రలో కనిపించబోతున్నాడు. అదే విషయాన్ని టీజర్‌లో చూపించి ప్రభాస్ పాత్రని పరిచయం చేశారు. టీజర్ లో ప్రభాస్ వాయిస్ కి తగ్గట్టుగా విజువల్స్ ని చూపించారు. అయితే ఒక షాట్ లో విక్రమాదిత్య చిత్రాన్ని ప్రముఖంగా ప్రచురిస్తూ `భాతర అత్యవసర పరిస్థితిని ఊహించిన వ్యక్తి` అని చూపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ షాట్ ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాపై మరింత ఆసక్తిని క్రేజ్ ని పెంచుతోంది.
ఈ పామిస్ట్ పాత్రని దర్శకుడు ఈ కథలో ఎలా చూపించబోతున్నాడు అన్నది కూడా పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కథా నేపథ్యం.. హీరో పాత్ర చిత్రణ కొత్తగా వుండటం.. 1970.. 8ల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్‌లోని పలు షాట్‌లు స్పష్టం చేస్తున్నాయి.
దీనికి సంబంధించిన సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు. సినిమాలో ఎవరూ ఊహించని అత్యంత రహస్యాలు వున్నాయని అర్థమౌతోంది. ఆ రహస్యాలు ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఇండియన్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రేరణ పాత్రలో నటించింది. మరో కీలక పాత్రలో `మైనే ప్యార్ కియా` ఫేమ్ భాగ్యశ్రీ కనిపించబోతోంది. ఇక ఓ సర్ ప్రైజింగ్ క్యారెక్టర్ లో రెబల్ స్టార్ కృష్టం రాజు కూడా మెరవబోతున్నారు. యూరప్ అందాల మధ్య అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీని జనవరి 14న వరల్డ్ వైడ్‌గా తెలుగు.. తమిళ.. మలయాళ.. హిందీ.. కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
టీజర్‌తో అద్భుతాలు సృష్టిస్తున్న ఈమూవీ రేపు థియేటర్లలో ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్పిందే.