యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాధేశ్యామ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా ఆ సినిమా గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దాంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. కాని సినిమా అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది. విడుదల అయిన అన్ని భాషల్లో కూడా రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్ గానే నిలిచింది.
రాధేశ్యామ్ ప్లాప్ ప్రభావం ప్రభాస్ పై ఉంటుందని.. ఆయన తదుపరి సినిమా లపై ఉంటుందని కొందరు భావించారు. కాని రాధేశ్యామ్ ప్లాప్ గురించి ప్రభాస్ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. రాధేశ్యామ్ ప్లాప్ తో ఇంకాస్త స్పీడ్ పెంచి సినిమాలను చేసి వెంటనే సక్సెస్ లను దక్కించుకోవాలనే ఉత్సాహం ఆయనలో కనిపిస్తుంది అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ప్రభాస్ స్పీడ్ కు ప్రస్తుతం ఆయన సినిమా ల షూటింగ్స్ సాక్ష్యం అన్నట్లుగా నిలుస్తున్నాయి. ప్రభాస్ ఒకే సారి సలార్ మరియు ఆదిపురుష్ ల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇలా ఒక పాన్ ఇండియా స్టార్ హీరో ఒకే సారి రెండు సినిమాల యొక్క షూటింగ్స్ లో పాల్గొనడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మరో వైపు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా విడుదలకు రెడీ అవుతుంది.
ఈ మూడు సినిమాలు కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా కొన్ని నెలల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఆరంభం నుండి మొదలుకొని మూడు సినిమాలు కూడా కాస్త తేడాతో అన్ని సినిమాలు కూడా ఒకే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభాస్ ఫ్యాన్స్ కు రాబోయే ఏడాది ఖచ్చితంగా పండగే అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు. రాధేశ్యామ్ సినిమా ప్లాప్ అయ్యిందని సినిమాల విషయంలో నిర్ణయాలు మార్చుకోవడం.. షెడ్యూల్స్ చేంజ్ చేసుకోవడం ఏమీ చేయకుండా సింపుల్ గా స్వీట్ గా ప్రభాస్ తాను ముందు కమిట్ అయిన విధంగా సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
రాధేశ్యామ్ విషయంలో అంచనాలు తప్పినా కూడా ఈ మూడు సినిమాల్లో మూడుకు మూడు లేదా కనీసం రెండు సినిమా లు అయినా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాల కోసం ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.