రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడి పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. సినిమా ప్రారంభమైన నాటి నుంచి యూనిట్ పూర్తిగా చీత్రీకరణలోనే బిజీ అయింది. మధ్యలో కరోనా ప్రభావంతో ఏదీ షెడ్యూల్ ప్రకారం జరగలేదు. అన్ని పనులు ఆలస్యంగానే జరిగాయి. సినిమా అప్ డేట్స్ అందించడంలోనూ యూనిట్ మొదటి నుంచి నెమ్మదిగానే ఉంది. అభిమానుల కోసం మచ్చుకి ఒకటి రెండు పోస్టర్లు వదిలారు తప్ప వాటిపై హైప్ క్రియేట్ చేయడంలో ఇంపాక్ట్ అన్నదే లేదని విమర్శ ఉంది. దీనికి తోడు సినిమాకి ప్రచారం కూడా అంతగా చేయలేదు. హైప్ ని తీసుకురావడంలో యూనిట్ ఓ రకంగా వెనుకబడిందనే తెలుస్తోంది. అయితే ఇకపై అన్ని లెక్కలు సరి చేయడానికి టీమ్ రెడీ అవుతోంది.
చిత్రీకరణ చివరి దశలో ఉన్న నేపథ్యంలో యూనిట్ ప్రచారంలో వేగం పెంచాలని ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ నుంచి అసలు సిసలు ప్రచారం మొదలు పెట్టాలని భావిస్తోంది. ముందుగా మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయనున్నారుట. మరి రిలీజ్ కు ఇంకా నాలుగు నెలలు సమయం ఉంది. అప్పుడే పాటలు రిలీజ్ చేయడం వెనుక మతలబు ఏంటంటే? ప్రేక్షకుల్ని ముందుగానే ప్రిపేర్ చేయించి...మ్యూజికల్ గా హిట్ కొడితే సినిమాకి అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్స్ జనరేట్ అవుతాయన్న ఆలోచనతోనే యూనిట్ ముందొస్తు ప్రణాళిక ను సిద్ధం చేస్తోందట.
ఈ మధ్యలో టీజర్..ట్రైలర్ రిలీజ్ చేస్తే అమాంతం గ్రాఫ్ ని పైకి లేపే ఛాన్స్ ఉంది. ఇది 1970 పిరియాడికల్ లవ్ స్టోరీ కాబట్టి జనాల్ని ఆ తరానికి తీసుకెళ్లాలంటే ఇలాంటి ప్రణాళిక తప్పని సరే అని మెజార్టీ వర్గం సైతం భావిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ కూడా అధికంగానే ఉంటాయి. సినిమాలో దాదాపు 20 నిమిషాలకు పైగా గ్రాఫిక్స్ సన్నివేశాలు హైలైట్ గా మలచనున్నట్లు తెలిసింది. దీనిలో భాగం ఈ వర్క్ మొత్తం 60 స్టూడియోల్లో చేస్తున్నారుట. సీజీలో ది బెస్ట్ కావాలంటే వర్క్ ని డివైడ్ చేసి ఎక్కువ స్టూడియోలకు ఇస్తే మనసు పెట్టి పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టే యూనిట్ ఆ రకంగా డివైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి `జిల్` ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
సంక్రాంతి స్పెషల్ గా బరిలోకి..
భారీ హైప్ నడుమ `రాధేశ్యామ్` పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథాంశం యూనిక్. సాంకేతికంగానూ మరో లెవల్లో ఉంటుందని సమాచారం. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరి మెస్మరైజ్ చేయనుంది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్షన్ సన్నివేశాల్ని అంతే హైలైట్ గా తీర్చిదిద్దారు. ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలోని మూవీ అని ..ప్రతీ సన్నివేశం ఆద్యంతం ఆసక్తికరంగా ట్విస్టులతో ఎంతో అద్బుతంగా ఉంటుందని కథనాలొచ్చాయి.
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా రికార్డులకెక్కిన రాధేశ్యామ్ రాక కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కరోనా క్రైసిస్ వల్ల ఈ సినిమా రిలీజ్ అంతకంతకు ఆలస్యమైంది. 2021 సంక్రాంతి .. సమ్మర్ రిలీజ్ అంటూ ప్రచారం సాగినా అది వీలుపడలేదు. ఇటీవలే రిలీజ్ తేదీని లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మకర సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది.