పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన లవ్ స్టోరీ రాధేశ్యామ్ మూవీ గురించి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నటువంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పరంగా ఈ సినిమానే ముందు ఫినిష్ చేసే అవకాశం ఉంది. రాధేశ్యామ్ పీరియడిక్ లవ్ స్టోరీ అనే విషయం తెలిసిందే.
1970ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనుండగా.. ప్రభాస్ ప్రియురాలిగా పూజాహెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తోంది. అయితే జులై 30న రాధేశ్యామ్ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పట్లో రిలీజ్ కాదని అర్ధమవుతుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని రాధేశ్యామ్ చిన్న షెడ్యూల్ మిగిలి ఉంది. అసలే ఏడాదిగా వెయిట్ చేస్తున్న రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరిదశలో ఉన్నాయి. జిల్ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా సాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. తాజాగా సమాచారం ప్రకారం.. రాధేశ్యామ్ అన్ని భాషలకు చెందిన సాటిలైట్ రైట్స్ మొత్తం జీ స్టూడియోస్ వారు సొంతం చేసుకున్నారు. అలాగే రాధేశ్యామ్ డిజిటల్ రైట్స్ కూడా జీ స్టూడియోస్ వారే దక్కించుకోగా.. ఒక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ వారు చేజిక్కించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ మాత్రం సాహో ఫేమ్ టి-సిరీస్ వారు సొంతం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రభాస్ సలార్ - ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.