ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న సమయంలోనే 'రాధే శ్యామ్' సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. సాహో విడుదల అవ్వక ముందు ప్రారంభం అయిన రాధే శ్యామ్ సినిమా చాలా ఆలస్యం అయ్యింది. మొదట షూటింగ్ ఆలస్యం అయ్యింది.. ఆ తర్వాత కరోనా వల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. సెకండ్ వేవ్ కు ముందు ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు ప్రకటించారు. కాని సెకండ్ వేవ్ తో మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది. రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణ ముగిసినట్లుగా యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. కనుక వచ్చే సంక్రాంతికి వారు చెప్పినట్లుగా ఈసారి ఖచ్చితంగా విడుదల చేస్తారు అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. సినిమా విడుదల నేపథ్యంలో భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ అభిమానులను రాధేశ్యామ్ కోసం అలర్ట్ చేసేలా ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేయాలని భావించారు.
రాధే శ్యామ్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను సెప్టెంబర్ లోనే మొదలు పెట్టాలని మొదట భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ నుండి రాధే శ్యామ్ హడావుడి మొదలు పెట్టాలని భావిస్తున్నారట. అక్టోబర్ లో రాధే శ్యామ్ సినిమా లో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే బర్త్ డే ఉంది. అదే అక్టోబర్ లో ప్రభాస్ బర్త్ డే కూడా ఉంది. ఇద్దరి బర్త్ డే ల సందర్బంగా పోస్టర్ లు లేదా ఇతర అప్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ఈ నెల నుండే సందడి మొదలు చేస్తే వారిద్దరి పుట్టిన రోజులకు విడుదల చేసేందుకు అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇచ్చేందుకు ఏమీ ఉండవు. అందుకే ఈ సినిమా కు సంబంధించిన పోస్టర్ లు మరియు వీడియోలు అన్నింటిని కూడా అక్టోబర్ లోనే ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
ప్రమోషన్ కార్యక్రమాలు కాస్త ఆలస్యం అవుతున్నాయేమో కాని విడుదల తేదీ మాత్రం ఇప్పటికే ప్రకటించిన వచ్చే సంక్రాంతికి మాత్రం తప్పకుండా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. థర్డ్ వేవ్ వచ్చి పరిస్థితి మరీ బ్యాడ్ గా ఉంటే చెప్పలేం కాని రాధే శ్యామ్ ను ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తామని అంటున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ ను విడుదల చేస్తే ఆ వెంటనే సలార్ మరియు ఆదిపురుష్ లు కూడా బ్యాక్ టు బ్యాక్ కొన్ని నెలల గ్యాప్ లోనే విడుదల కు సిద్దం అవుతున్నాయి. ఆదిపురుష్ ను వచ్చే ఏడాది ఆస్టులో అన్నారు. కాని షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల కాస్త ఆలస్యం అయ్యేలా ఉన్నాయి. కాని సలార్ ను మాత్రం వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా విడుదల చేస్తారని అంటున్నారు.