పెళ్లయిన ప‌దేళ్ల‌కు భ‌ర్త‌తో రాధికా ఆప్టే క్లిక్

Update: 2022-07-10 09:59 GMT
రాధికా ఆప్టే.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. వ‌ర్మ డిస్క‌వ‌రీగా ర‌క్త చ‌రిత్ర గాళ్ గా తెలుగు వారి మ‌న‌సుల్లోకి ప్ర‌వేశించిన ఆప్టే ఇక్క‌డ వ‌రుస చిత్రాల్లో న‌టించింది. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న భారీ చిత్రాల్లో న‌టించి విజ‌యాలు అందుకుంది.

రాధికా ఆప్టే ఏది చేసినా స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో `మోనికా: ఓ మై డార్లింగ్`  అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇది నెట్ ప్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే వెబ్ సిరీస్ ల్లో త‌న‌దైన మార్క్ వేసిన ఈ సీనియ‌ర్ బ్యూటీ నెట్ ప్లిక్స్ అందించే బోల్డ్ కంటెంట్ తో బోలెడంత పాపుల‌రైంది. ఇత‌ర భాష‌ల్లోనూ రాధిక న‌టిస్తూ బిజీగా ఉంది.

రాధిక వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే..తాను వివాహిత‌ను అని త‌న భ‌ర్త విదేశాల్లో ఉంటార‌ని అప్పుడ‌ప్పుడు క‌లుసుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా దాప‌రికం లేకుండా వెల్ల‌డించింది. ఇరువురూ కెరీర్ ప‌రంగా రెండు వేర్వేరు దేశాల్లో నివ‌శిస్తున్నామ‌ని ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది ఆప్టే.

అయితే త‌న భర్త బెనెడిక్ట్ టేలర్ తో రాధిక ఫోటోలు అంత‌ర్జాలంలో క‌నిపించేది చాలా త‌క్కువ‌. 2012 పెళ్లి నుంచి ఒక్క ఫోటో కూడా ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌టి ప్ర‌పంచానికి ఆవిష్కృతం కాలేదు. రాధిక త‌న ఫ్యామిలీ లైఫ్ గురించి ప్ర‌చారం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌దు. ప్రతిసారీ తన పనితో ప్రేక్షకులను అలరించేందుకు ఇష్ట‌ప‌డుతుంది. నటిగా మాత్ర‌మే తన విశేషాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇష్టపడుతుంది కానీ భ‌ర్త గురించి తరచుగా ప్ర‌చారం చేయదు. వాస్తవానికి ఇన్ స్టాలో రాధిక - ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ ల ఫోటోలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే దాని వెనుక ఒక కారణం ఉందని తాజాగా రాధిక ఆప్టే వెల్లడించింది. నిజానికి తాను ఫోటోలకు ఫోజులిచ్చేందుకు అంతగా ఇష్టపడనని ..బెనెడిక్ట్ ఈ విష‌యంలో మరింత `చెత్త` అభిరుచిని క‌లిగి ఉన్నార‌ని తెలిపింది.

నిజానికి ఈ జంట ఆల్బ‌మ్ లో వారి 2012 వివాహానికి సంబంధించిన‌ ఒక్క ఫోటో కూడా లేదుట‌. ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంది రాధిక‌. నేను 10 సంవత్సరాల క్రితం బెనెడిక్ట్ ని వివాహం చేసుకున్నప్పుడు మా ఫోటోలను క్లిక్ చేయడం కూడా మర్చిపోయాము. మేము అప్ప‌టిక‌ప్పుడు వివాహం చేసుకున్నాం. మేము మా స్నేహితులను పిలిచాం. మేమే భోజనాలు చేసాం. ఉత్తర ఇంగ్లాండ్ లోని ఒక ప్రదేశంలో వివాహం చేసుకున్నాం. కెరీర్ ప‌రంగా త‌ర్వాత‌ విడిపోయాం. కానీ మా ఫోటోలు లేవు. మా స్నేహితుల్లో సగం మంది ఫోటోగ్రాఫర్ లు అయినప్పటికీ వారెవరూ కూడా ఫోటోలు తీయ‌లేదు. మేమంతా బాగా తాగి ఉన్నాం. కాబట్టి నా పెళ్లికి సంబంధించిన ఫోటోలేవీ లేవు. ఇది మ‌రోర‌కంగా చాలా బాగుంది.. అని కూడా రాధిక అంది.

నా కంటే నా భర్త అధ్వాన్నం.. అతను ఫోటోలకు ఫోజులివ్వ‌డు. కానీ ఇప్పుడు మేం వెకేష‌న్ కి వెళ్లినప్పుడు కనీసం ఏదైనా ఒక ఫోటోని క్లిక్ చేయడానికి ప్రయత్నిస్తాం..!! అని వెల్ల‌డించింది. రాధిక - బెనెడిక్ట్ జంట చాలా అరుదుగా ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోల‌ను షేర్ చేస్తుంటారు.

రాధిక -బెనెడిక్ట్ 2012లో వివాహం చేసుకున్నారు. వారు ముంబై - లండన్ మధ్య ప్ర‌యాణాల‌తో తమ సమయాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ జంట 2011లో రాధిక కాంటెంపరరీ డ్యాన్స్ నేర్చుకోవడానికి విశ్రాంతి కోసం లండన్ లో ఉన్నప్పుడు కలుసుకున్నారు. ఇంత‌లోనే స్నేహం కుదిరింది.. కలిసి జీవించడం ప్రారంభించారు. 2013లో అధికారికంగా వెల్ల‌డించే ముందు వారు 2012లో హ‌డావుడి లేని పెళ్లి చేసుకున్నారు. సింపుల్ గా వెడ్డింగ్ ని కానిచ్చేశారు. అందుకే ఈ పెళ్లి నుంచి పోటోలేవీ వైర‌ల్ కాలేదు.

రాధిక సినిమాల విష‌యానికి వ‌స్తే.. విక్రాంత్ మాస్సేతో కలిసి `ఫోరెన్సిక్‌`లో ఇటీవల కనిపించింది. తదుపరి `విక్రమ్ వేద`లో క‌నిపించ‌నుంది. ఇందులో హృతిక్ రోషన్ - సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు.
Tags:    

Similar News