ఆ విషయంలో ఇతరుల జోక్యం వద్దంటున్న రాధిక ఆప్టే..!

Update: 2022-11-07 08:12 GMT
మరాఠి ముద్దుగుమ్మ రాధిక ఆప్టే కొంతకాలంగా బోల్డ్ పాత్రలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. కథ డిమాండ్ మేరకు ఎలాంటి హద్దులు లేకుండా నటించడానికి రాధిక ఆప్టే ఏమాత్రం వెనుకడుగు వేయరు. ఈ క్రమంలోనే పలు బాలీవుడ్ చిత్రాల్లో నగ్నంగా నటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. కేవలం బోల్డ్ పాత్రలు చేయడమే ముక్కుసూటిగా మాట్లాడటంలోనూ రాధిక దిట్ట.

ఈ భామ తరుచూ బోల్డ్ స్టేట్మెంట్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె మాటలు పలుసార్లు వివాదాస్పదమైన ఘటనలు కూడా ఉన్నాయి. రాధిక ఆప్టే హిందీ సినిమాతో అరంగేట్రం చేసినప్పటికీ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించింది. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

'రక్త చరిత్ర' మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది. నందిని పాత్రలో కన్పించి నటనాపరంగా గుర్తింపు తెచ్చుకుంది. 'రక్త చరిత్ర-2'.. 'ధోని'.. 'లెజెండ్'.. 'లయన్' సినిమాల్లో నటించి తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కాగా బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

హిందీ.. ఇంగ్లీష్ భాష సినిమాలతో పాటుగా దక్షిణాది భాషల్లోనూ రాధిక ఆప్టే నటిస్తోంది. షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీసుల్లో రాధిక ఆప్టే తనదైన శైలిలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే రాధిక ఆప్టే నటించిన తాజా చిత్రం 'మోనిక ఓ మై డార్లింగ్' ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాధిక ఆప్టే ప్రేమికులు.. దంపతులకు ఒక సలహా ఇచ్చింది. ప్రేమికులు.. భార్యాభర్తల మధ్యలో ఏవైనా మనస్పర్థలు.. గొడవలు లాంటివి తలెత్తితే మధ్యలో మూడో వ్యక్తిని రానీయవద్దని చెబుతోంది. థర్డ్‌ పార్టీ జోక్యం చేసుకుంటే సమస్య మరింత జఠిలం అవుతుందని పేర్కొంది. దీని వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదని తెలిపింది.

మన జీవితాన్న ఎలా సరిదిద్దుకోవాలో..  మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మనకు మాత్రమే తెలుసని అంటోంది. థర్డ్ పార్టీకి మన విషయాలు తెలియవని చెప్పింది. వీరివల్ల కొన్నిసార్లు మనకు మరిన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండొచ్చని పేర్కొంది. వీలైనంత వరకు ప్రేమికులు.. దంపతులు మూడో వ్యక్తికి దూరంగా ఉండాలని రాధిక ఆప్టే సలహా ఇస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News