హాట్ బ్యూటీ.. కాంట్రావర్షియల్ గర్ల్.. మీడియా విలన్.. ఇలా ఒక్కో సమయంలో ఒక్కో ట్యాగ్ తగిలిచ్చుకునే బ్యూటీ ఎవరో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. రాధిక ఆప్టే గురించి తెలియని వారు ఉండరు. బీచ్ లో బికినీ కాకుండా చీరలో తిరగాల అని ఈ మధ్య మీడియాకు కౌంటర్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎప్పుడు ఎదో ఒక మ్యాటర్ ని మెడలో వేసుకొని తిరుగుతుంది. ఇక మీడియా వారు అడగకుండా ఉండడానికి ఇష్టపడరు.
అసలు మ్యాటర్ లో వస్తే ఇటీవల రాధిక ఒక హీరోపై చేయి చేసుకుందని మిడియలో కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. చాలా మంది ఎన్నో రకాలుగా చెప్పినా వాటిపై రాధిక స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ రీసెంట్ గా నేహా ధూపియ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షోలో పాల్గొని అసలు కథను వివరించింది. ఆ గొడవ నిజమే గాని నేను హీరోపై చేయి చేసుకోలేదు. అతను వచ్చి నా కాలి పై గిలిగింతలు పెట్టాడు. నేను ఒక్కసారిగా భయపడి గట్టిగా అరిచేశాను. ఇంకెప్పుడు లైఫ్ లో నాతో ఇలా ప్రవర్తించకు అని రాధిక వివరించింది.
అదే జరిగిందట. కానీ కొట్టడం అని చాలా మంది చెప్పారు. దాని సంగతి ఏంటంటే.. మన మీడియా వాళ్లు తెలియక చేశారో లేక అతి తెలివి ఉపయోగించారో గాని స్నాప్డ్' అని రాధిక చెబితే 'స్లాప్డ్' అని పదాలను మార్చేశారు. దీంతో టాప్ హీరోపై చేయి చేసుకున్న రాధిక ఆప్టే అని అందరు మౌత్ టాక్ తో ప్రమోషన్స్ చేశారు. ఇక ఆ హీరో ఎవరో సోషల్ మీడియాలో రాధిక న్యూస్ లను చదివితే మీకే అర్ధమవుతుంది.