పరిశ్రమలో ఎదిగేందుకు.. నటిగా కొన్ని ప్రామాణిక కొలతలతో కనిపించడానికి తన ముక్కును సవరించమని.. రొమ్ము ఇంప్లాంట్లు బోటాక్స్ ను ఉపయోగించమని కొందరు అడిగారట. కానీ తాను ఆ పనిని చేయలేదు. చేయాల్సినది చేయడం ద్వారా మాత్రమే నటిగా ఎదిగింది. ప్రతిభను సానబట్టి అంచెలంచెలుగా ఎదిగింది. కెరీర్ ఆరంభ రోజుల్లో తాను విన్న రకరకాల విచిత్రమైన సలహాల గురించి రాధిక ఆప్టే బోల్డ్ గా ఓపెనైంది.
బాలీవుడ్ లో అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతున్న రాధికా ఆప్టే తన శక్తివంతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అది OTT స్పేస్ అయినా పెద్ద తెర అయినా నటిగా రాజీ అన్నదే లేకుండా పని చేస్తుంది. రాధిక ప్రవేశించిన ప్రతి రంగంలోనూ తానేంటో నిరూపించుకుంది. నటనలో తన ప్రదర్శనలకు మంచి సమీక్షలను కూడా పొందింది. అయితే అంత పెద్ద స్థాయి ఉన్న నటిని కూడా సర్జరీల కోసం కత్తి కిందకు వెళ్లమని అడిగారన్నది ఎందరికి తెలుసు? కానీ ఇది నిజం.
తాజా ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే షోబిజ్ వరల్డ్ లో కొందరు తనను ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాలని కోరినట్టు వెల్లడించారు. నాకు ఇంతకు ముందు అలాంటి ఒత్తిడి ఉండేది. పరిశ్రమకు కొత్తగా వచ్చినప్పుడు.. నా శరీరాకృతి పరంగా ముఖం పరంగా చాలా మార్పులు చేయాలని చెప్పారు. నేను మొదట కలుసుకున్నప్పుడు నా ముక్కును మార్చుకోవాలని అన్నారు. నాతో రెండవ సమావేశంలోనే మేకర్స్ ఈ మాట చెప్పారు. బూబ్ జాబ్ (స్థనాలు పెంచుకోవాలని) చేయించుకోవాలని కొందరు అడిగారు. ఆ తర్వాత నా కాళ్ల సౌందర్యం కోసం ఏదైనా చేయమని.. ఆపై నా దవడలకు ఏదైనా చేయించాలని చెప్పారు. ఇక్కడ ఎక్కడో (ఆమె చెంపలకు చూపుతూ) బోటాక్స్ ను రీఫిల్ చేయాలని కూడా చెప్పారు. ఇలా నా వెంట్రుకలకు రంగు వేయడానికి 30 సంవత్సరాలు పట్టింది.. అని సెటైరికల్ గా తనకు జరిగిన వాటిని వెల్లడించింది.
నేను కనీసం ఇంజెక్షన్ కూడా తీసుకోను. అదే నన్ను ఆపివేసింది. ఇతరుల కోరికల వల్ల నేను ఎప్పుడూ ఒత్తిడికి గురికాలేదు. నిజానికి నేను ఇలాంటి సలహాలిచ్చేవాళ్లపై చాలా కోపంగా ఉన్నాను. ఇవన్నీ నా శరీరాన్ని మరింత ప్రేమించడంలో నాకు సహాయపడ్డాయి. ఎందుకంటే నేను `నేను నా శరీరాన్ని అమితంగా ప్రేమిస్తాను`` అని అన్నారు. ఇండస్ట్రీ జనం నిరంతరం అలా అడగడం వల్ల నేను కొంచెం అలసిపోయాను.. అనారోగ్యానికి గురయ్యాను. అందుకే ఇవేవీ నన్ను ప్రభావితం చేయవు. నా ఉద్దేశ్యం.. నేను ప్రభావితం అయ్యేలా ఏదీ ఉండదు! అని అన్నారు.
రాధిక ఆప్టే ఇటీవల నవాజుద్దీన్ సిద్ధిఖీ `రాత్ అకేలీ హై`లో కనిపించింది. ఆమె ఇప్పుడు `ఫోరెన్సిక్` సిరీస్ లో కనిపించనుంది. దీనిలో ఆమె విక్రాంత్ మాస్సేతో కలిసి నటించింది. ఈ చిత్రాన్ని 24 జూన్ 2022న ZEE5లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హృతిక్ రోహన్ -సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విక్రమ్ వేద హిందీ రీమేక్ లో కూడా రాధిక కనిపించనుంది. ఇందులో రోహిత్ సరాఫ్ -యోగితా బిహానీ కూడా కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.