`రక్తచరిత్ర` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది రాధిక ఆప్టే. ఆ తర్వాత బాలయ్య సరసన లెజెండ్- లయన్ చిత్రాల్లో నటించింది. రజనీ కబాలిలోనూ నాయికగా నటించింది. అయితే సినిమాలతో కంటే వివాదాలతోనే రాధిక ఆప్టే పేరు మార్మోగింది. వివాదాస్పద వెబ్ కంటెంట్ తో తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ తో మరింత పాపులారిటీ పెంచుకున్న ఆప్టే ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. వరుస వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో రాధిక సెన్సేషనల్ కామెంట్ చేసింది. సాటి నాయికల సర్జరీ ముఖాల్ని చూడలేక అలసిపోయానని హాట్ కామెంట్ తో చెలరేగింది. ఇండస్ట్రీలో నటిగా తాను ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే వెల్లడించింది. సాటి నటీమణులు తమ ముఖాలను శరీర భాగాలను శస్త్రచికిత్సలతో మార్చుకునేందుకు ప్రయత్నించడాన్ని చూసానని వాటిని తాను భరించలేకపోతున్నానని వెల్లడించింది ఆప్టే.
ముఖ్యంగా పరిశ్రమలో వయస్సుతో పోరాడలేక తారలు శరీరంతో పోరాడుతున్నట్లు ఆప్టే పేర్కొంది. ముఖం శరీరాకృతిని మార్చడానికి శస్త్రచికిత్సలు చేయించుకున్న చాలా మంది సహచరులు తనకు తెలుసునని అంది. తాను దానిని భరించలేనని తెలిపింది. బాడీ పాజిటివిటీ గురించి బహిరంగంగా మాట్లాడే చాలా మంది ఇలాంటి చాలా పనులు చేశారని రాధిక ఎత్తి చూపారు. ఇలాంటివి సవాల్ గా మారాయని తాను చూసి చూసి అలసిపోయానని కూడా ఆ ఇంటర్వ్యూలో రాధిక వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం విక్రమ్ వేద రీమేక్ చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆప్టే ఓ ఇంటర్వ్యూలో పలు వివాదాస్పద అంశాలను టచ్ చేసింది. 17 ఏళ్లకు పైగా పరిశ్రమలో భాగమైన రాధిక ఒక విషయంలో తాను ఖచ్చితంగా ఉన్నానని.. తాను దేనికీ రాజీ పడడానికి ఇష్టపడనని చెప్పింది. నచ్చని అంగీకరించలేని పనులు చేయలేను. గొప్పగా భావించని వ్యక్తి గురించి గొప్పగా చెప్పడంలో కూడా చాలా అలసిపోయాను.. అని రాధిక వెల్లడించింది. చిన్న చిన్న చర్చలు.. అనవసరమైన పార్టీలకు హాజరవ్వడం పూర్తయిందని కూడా పేర్కొంది. తనకు పరిశ్రమలో స్ఫూర్తి నింపే స్పార్క్ కనిపించడం లేదని.. అందుకే దానిని స్వయంగా అన్వేషించడానికి కొంత విరామం తీసుకున్నానని ఆమె చెప్పింది. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదాలతో అంటకాగడం రాధిక ఆప్టేకి కొత్తేమీ కాదు. ఇదే వరుసలో రాధిక కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్గి రాజేస్తోంది. సోషల్ మీడియాల్లో దీనిపై విస్త్రతమైన డిబేట్ రన్ అవుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే రాధిక తదుపరి `విక్రమ్ వేద`లో కనిపించనుంది. ఇందులో హృతిక్ రోషన్ -సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
విక్రమ్ వేద రీమేక్ లోని తన పాత్ర షూటింగ్ ను ఆప్టే పూర్తి చేసుకుంది. రాధిక ఇటీవల 10 రోజుల షెడ్యూల్ కోసం ముంబైలో హృతిక్ రోషన్ అండ్ టీమ్ తో చేరారు. దీంతో తన పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళ హిట్ `విక్రమ్ వేద`కి అధికారిక రీమేక్. ఒరిజినల్ లో ఆర్ మాధవన్ - విజయ్ సేతుపతి టైటిల్ రోల్స్‌లో నటించారు. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ-``విక్రమ్ వేద ఈ సంవత్సరంలో అత్యంత ఉత్కంఠభరితమైన వినోదాత్మక చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ప్రకటన ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. రెండు దశాబ్దాల తర్వాత ఈ డైనమిక్ ద్వయాన్ని పెద్ద తెరపై మళ్లీ కలిపి చూసేందుకు మేము సంతోషిస్తున్నాము. విక్రమ్ వేద థియేటర్లలో తన మ్యాజిక్ తో బాక్సాఫీస్ హిట్ అవుతుందని నమ్ముతున్నాము`` అన్నారు. సైఫ్ - హృతిక్ చివరిగా 2002 విడుదలైన `నా తుమ్ జానో నా హమ్`లో నటించారు. విక్రమ్ వేద రీమేక్ లో ఒకరితో ఒకరు పోటీ పడి నటిస్తున్నారని టీమ్ చెబుతోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ పోలీస్ పాత్రలో నటిస్తుండగా.. హృతిక్ పేరుమోసిన గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. 30 సెప్టెంబర్ 2022న మూవీ విడుదల కానుంది. ఇందులో నటిస్తున్న రాధిక ఆప్టే పాత్రకు చక్కని స్కోప్ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.