సెలబ్రెటీలు ఏం మాట్లాడినా వివాదం అయ్యే అవకాశం ఉంది.. వారు ఏం చేసినా కూడా వివాదాస్పదం చేసేందుకు కొందరు చూస్తారు. అందుకే సెలబ్రెటీలు మాట్లాడాలంటే కూడా భయపడుతారు. కాని బయటి వారు అలా కాదు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవచ్చు. వారు ఎవరికి భయ పడాల్సిన అవసరం లేదు. వారి భావాన్ని ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా వెళ్లడించే హక్కు వారికి ఉంటుంది.
కాని సెలబ్రెటీలకు అలా ఉండదు అంటూ బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధిక మదన్ అంటోంది. సినిమా ఫీల్డ్ లో ఉన్న వారు ఏం మాట్లాడాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.. అలాగే నిజాలు మాట్లాడినా కూడా కొన్ని సార్లు తప్పు అయ్యి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.
షిద్దత్ సినిమా తో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు గత నెలలో వచ్చిన ఈ అమ్మడు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో హీరోగా విక్కీ కౌశల్ తమ్ముడు సన్నీ కౌశల్ హీరోగా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రాధిక మదన్ కు ఆఫర్లు పెరుగుతున్నాయి.
ఇంకా హీరోయిన్ గా మొదటి అడుగులే వేస్తున్న ముద్దుగుమ్మ రాధిక మదన్ అప్పుడే ఏం మాట్లాడాలి అన్నా కూడా తప్పే అంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్ను విమర్శించేది ఎవరు అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఆమెను లైట్ తీసుకుంటున్నట్లుగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
హీరోయిన్ షిద్దత్ తాజా ఇంటర్వ్యూలో చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. నిజంగానే బయట ఉన్న వారు ముఖ్యంగా ఇండస్ట్రీతో సంబంధం లేని వారు ఇండస్ట్రీ గురించి ఏదైనా మాట్లాడవచ్చు. కాని బయటి వారి గురించి ఇండస్ట్రీలో వారు లేదా.. ఇండస్ట్రీలో వారి గురించి ఇండస్ట్రీలో వారు మాట్లాడితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది.
మీడియా ఫోకస్ ఎక్కువగా సెలబ్రెటీలపై ఉంటుంది. ముఖ్యంగా ఈమద్య సోషల్ మీడియా చిన్న తప్పు చేస్తే సెలబ్రెటీలను ఏకి పారేద్దమా అనుకుంటూ కొందరు ఎదురు చూస్తున్నారు. అందుకే ఏ విషయం మాట్లాడాలన్నా సెలబ్రెటీల కంటే సామాన్యులకే ఎక్కువ ధైర్యం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయ పడటం తప్పేం కాదంటున్నారు.