ఫోటో స్టోరీ : నో బోర్డర్స్.. పిచ్చెక్కిస్తున్న రాధికా..!

Update: 2022-11-24 07:31 GMT
ఇండియన్ టాలెంటెడ్ యాక్ట్రెస్ లో రాధికా ఆప్టే ఒకరు. కెరీర్ లో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ఆమె సత్తా చాటుతూ వచ్చింది. బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ సినిమాల్లో కూడా రాధికా ఆప్టే నటించారు. ఏజ్ బార్ అవుతున్నా సరే గ్లామర్ షోలో తనని తానే సాటి అనిపించుకునేలా హాట్ షో చేస్తుంది అమ్మడు. 2005 లో తెరంగేట్రం చేసిన రాధికా ఆప్టే ఇప్పటికీ వరుస అవకాశాలతో అదరగొట్టేస్తుంది. బ్యూటీ విత్ టాలెంట్ అనేలా తనకు ఇచ్చిన ఏ పాత్రకైనా పూర్తి న్యాయం చేస్తుంది రాధికా అందుకే ఆమెకు ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి.

బాలీవుడ్ లోనే కాదు తెలుగు, బెంగాళి, మరాఠి, తమిళ సినిమాల్లో కూడా నటించి తన స్పెషాలిటీ చాటుకుంది రాధిక. కెరీర్ మొదలు పెట్టి 17 ఏళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ బాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో సూపర్ ఫాం కొనసాగిస్తుంది రాధికా ఆప్టే.

తను చేసిన పాత్రలతో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఎన్నో అవార్డులను అందుకుంది. సినిమాలకు ఈక్వల్ గా ఫోటో షూట్స్ తో కూడా రాధిక ఆప్టే హంగామా చేస్తుంది. గ్లామర్ షో లో పి.హెచ్.డి చేసిన అమ్మడు తన హాట్ పిక్స్ తో తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ అమ్మడి ఫోటో షూట్ సోషల్ మీడియాని వేడెక్కించేసింది.

బ్లాక్ బికినీ టాప్ తో.. గ్లామర్ షో లో నో బోర్డర్స్ అనేలా రెచ్చిపోతుంది రాధిక ఆప్టే. హాట్ ఫోటో షూట్ లో కూడా తన మార్క్ స్టైల్ ని ప్రదర్శిస్తుంది రాధిక. తెలుగులో కేవలం నాలుగైదు సినిమాలే చేసినా రాధికా అంటే టాలీవుడ్ ఆడియన్స్ కి విపరీతమైన క్రేజ్. ఆమె మళ్లీ తెలుగులో నటిస్తే చూడాలని అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంటున్న రాధిక సరైన ఛాన్స్ వస్తే ఏ భాషలో అయినా తను నటించడానికి రెడీ అంటుంది.

తను చేసే సినిమాల కన్నా అమ్మడి ఫోటో షూట్స్ తోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంటుంది రాధిక. రెగ్యులర్ బోల్డ్ అటెంప్ట్ తో తన మీద ఆడియన్స్ ఫోకస్ షిఫ్ట్ కాకుండా జాగ్రత్త పడుతుంది అమ్మడు. ఇండియన్ యాక్ట్రెస్ లో రాధికా లాంటి గట్స్ మరెవరికి ఉండవని చెప్పొచ్చు. అందుకే న్యూడ్ సీన్స్ లో కూడా నటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇండియన్ సినిమాలతో పాటుగా ఇంగ్లీష్ సినిమాలు చేస్తున్న రాధికకు వరల్డ్ వైడ్ క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News