ఆలీ ఫస్ట్ నైట్.. దర్శకేంద్రుడి స్టయిల్లో

Update: 2017-05-08 08:36 GMT
ఆలీ ఫస్ట్ నైట్ అనగానే ఇదేదో సినిమాకు సంబంధించిన వ్యవహారం అయ్యుంటుందిలే అనుకోకండి. ఇది ఆలీ నిజ జీవితానికి సంబంధించిన విశేషమే. ఇక్కడ రాఘవేంద్రరావు ప్రస్తావన ఎందుకొచ్చింది అంటారా? ఇక్కడే ఉంది ట్విస్టు. తన పెళ్లి రోజు సైతం రాఘవేంద్రరావు సినిమా షూటింగులో పాల్గొన్నాడట ఆలీ. అది అనుకోకుండా జరిగిందట. అలాగని ఆలీ డిజప్పాయింట్ కాకుండా ఓ స్టార్ హోటల్లో తన ఫస్ట్ నైట్ కోసం చక్కటి ఏర్పాట్లు చేయించి పెట్టాడట దర్శకేంద్రుడు. దీనికి సంబంధించిన విశేషాల్ని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. రాఘవేంద్రరావు తన యూనిట్లో వాళ్లను ఎంత బాగా చూసుకుంటాడో చెబుతూ కోట ఈ విషయం వెల్లడించారు.

రాఘవేంద్రరావు తీసిన ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక ప్రముఖ నటుడు డుమ్మా కొట్టేస్తే.. అప్పటికప్పుడు ఆలీతో ఆ పాత్రను రీప్లేస్ చేయాలని నిర్ణయించుకున్నాడట రాఘవేంద్రరావు. ఐతే ఆలీకి ఫోన్ చేస్తే.. ఉదయమే తన పెళ్లి అయిందని.. ఇంట్లో వేరే ఏర్పాట్లేవో జరుగుతున్నాయని చెప్పాడట. ఐతే వెంటనే భార్యను తీసుకుని ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేయమంటూ రాఘవేంద్రరావు చెప్పారట. ఆయన అంతగా చెప్పడంతో ఏదో అత్యవసరమే అయి ఉంటుందని ఆలీ భార్యతో కలిసి ఫ్లైట్ ఎక్కేశాడట. తర్వాత ఆలీని రిసీవ్ చేసుకుని షూటింగ్ స్పాట్ కు తీసుకెళ్లారట. కొన్ని కీలక సన్నివేశాలు తీశారట. ఆపై ఆ రోజు రాత్రికి ఒక స్టార్ హోటల్లో ఆలీకి ఫస్ట్ నైట్ కోసం చక్కటి ఏర్పాట్లు చేయించారట రాఘవేంద్రరావు. అది చూసి ఆలీ చాలా సంతోషించాడని వెల్లడించారు కోట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News