పండ్ల సరసం గురించి రాఘవేంద్రుడు

Update: 2016-01-18 09:30 GMT
రాఘవేంద్రరావు.. ఈ పేరు వినగానే అందరికీ కళ్ల ముందు హీరోయిన్ బొడ్డుపై పండు పండుతున్న దృశ్యం గుర్తుకొచ్చేస్తుంది. హీరోయిన్-పండు కాంబినేషన్ తో తెలుగు సినిమాకు గ్లామర్ పాఠాలు నేర్పిన రసిక దర్శకుడు రాఘవేంద్రరావు. ఈ శైలి ఆయనకు ఎందరో అభిమానుల్ని తెచ్చిపెట్టింది. అలాగే ఈ విషయంలో రాఘవేంద్రరావును విమర్శించే వాళ్లూ లేకపోలేదు. ఐతే రాఘవేంద్రరావు మాత్రం ‘అన్నమయ్య’ లాంటి సినిమాలోనూ తన ‘స్టయిల్’ చూపించారు. మరి హీరోయిన్-పండు విషయంలో ఆయనెందుకు అంత పర్టికులర్ గా ఉన్నారు. ఈ శైలి ఆయనకెలా అలవడింది.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నలభై సినిమాల వరకు నేను పూలు, పండ్ల జోలికి వెళ్లలేదు. కొత్తగా ఏదైనా చేయాలనే తలంపుతో హీరోయిన్ మీద పువ్వులు, పండ్లు వేయించాను. ముత్యాలు, వజ్రాలు లాంటివి కూడా వేసి పాటలు తీశాను. సెన్సార్ వాళ్లు చాలా పొయెటిగ్గా తీశారు అని కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. ఇలా చేస్తున్న టైంలో ఒకసారి ఓ హీరోయిన్ మీద పూలు, పండ్లు ఏమీ వేయకుండా మామూలుగా పాట తీశాను. దీంతో జనాలకు అదోలా అనిపించింది. ఆ సినిమాలో పండ్లు ఎందుకు వేయలేదు అంటూ ఉత్తరాలు కూడా రాశారు. దీంతో మళ్లీ నా శైలిలో పాటలు తీయడం మొదలుపెట్టా. అందానికి అభిషేకం చేయడం కోసమే నేను పాటల్లో పండ్లు - పూలు వేశాను. ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. తెరపై జనాలకు బ్యూటీ కావాలి. అందుకే అందాన్ని తెరపై మరింత బాగా చూపించడానికి డోసు పెంచాను. ఒకసారి ప్రేక్షకులకు ఆ డోసు అలవాటయ్యాక ఆ బ్రాండు అలాగే మెయింటైన్ చేయాల్సి వచ్చింది’’ అని దర్శకేంద్రుడు చెప్పాడు.
Tags:    

Similar News